మన్మోహన్ కు SPG సెక్యూరిటీ తొలగింపు

V6 Velugu Posted on Aug 26, 2019

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) సెక్యూరిటీని కేంద్రం తొలగించింది. ఆయనను  CRPF బలగాల భద్రత కిందకు తీసుకొచ్చింది. దేశంలోని ప్రముఖుల భద్రతను సమీక్షించే విభాగం నివేదికల ఆధారంగా కేంద్ర ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ,

ప్రముఖుల జీవితాలకు ముప్పు ఎంత వరకు ఉందనే వార్షిక సమీక్ష సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర హోంశాఖ అధికారి తెలిపారు. మన్మోహన్ కు ఎస్పీజీ భద్రతను తొలగించినప్పటికీ… ఆయను ఉన్న జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కొనసాగుతుందని చెప్పారు.

 

Tagged government, Ex PM Manmohan Singh, withdraws, SPG

Latest Videos

Subscribe Now

More News