ఏపీలో 4ఎమ్మెల్సీ పదవులకు గవర్నర్ ఆమోదం

ఏపీలో 4ఎమ్మెల్సీ పదవులకు గవర్నర్ ఆమోదం

అమరావతి: ఏపీలో నాలుగు నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సోమవారం ఆమోదం తెలిపారు. ఖాళీ అయిన నాలుగు స్థానాలను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా తోట త్రిమూర్తులు, రమేష్ యాదవ్, లేళ్ల అప్పిరెడ్, మోషేన్ రాజు లు ఎమ్మెల్సీలుగా ఎంపికకు లైన్ క్లియర్ అయింది. వీరు త్వరలోనే ఎమ్మెల్సీ పదవులు చేపట్టనున్నారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసేందుకు సీఎం జగన్ తన సతీమణి భారతిని వెంట బెట్టుకుని వెళ్లారు. సుమారు 40 నిమిషాల పాటు భేటీ జరిగినట్లు సమాచారం.

తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు బీద రవిచంద్ర యాదవ్, టీడీ జనార్ధన్, శ్రీనివాసులు, శమంతకమణిల పదవీ కాలం నెల 12వ తేదీతో ముగిసింది. ఖాళీ అయిన ఈ నాలుగు స్థానాల్లో కొత్తగా  నలుగురు ఎమ్మెల్సీలను గవర్నర్ నామినేట్ చేయాల్సి ఉండగా.. ఎమ్మెల్సీల పేర్లను ఏపీ ప్రభుత్వం గవర్నర్ కు పంపింది. అయితే కొందరిపై క్రిమినల్ కేసులున్నాయని అభ్యంతరాలు వ్యక్తం కావడం.. అవి కాస్తా గవర్నర్ దగ్గరకే వెళ్లడంతో ఆయన కొత్త ఎమ్మెల్సీల పేర్ల ప్రకటనకు సంశయించినట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో సీఎం గవర్నర్ ను కలవడం.. ఆయన వెంటనే ఆమోదం పలకడం చకాచకా జరిగిపోయింది.