స్టూడెంట్లను పోటీ ప్రపంచం వైపు మళ్లించాలి: గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాధాకృష్ణన్‌‌‌‌‌‌‌‌

స్టూడెంట్లను పోటీ ప్రపంచం వైపు మళ్లించాలి: గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాధాకృష్ణన్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: విద్యార్థుల ప్రతిభను సానబెట్టి, వారిని పోటీ ప్రపంచంలో విజయం సాధించేలా తీర్చిదిద్దాలని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ అన్నారు. యూనివర్సిటీలు డ్రగ్స్‌‌‌‌‌‌‌‌కు, అవినీతికి దూరంగా ఉంటూ ఆదర్శంగా నిలవాలని సూచించారు. వర్సిటీల నుంచి దేశానికి మంచి నాయకత్వాన్ని అందించేందుకు కృషి చేయాలన్నారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని శామీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేటలో ఇక్ఫాయ్ డ్రీమ్డ్ వర్సిటీ ఆధ్వర్యంలో మూడ్రోజుల పాటు జరిగే అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ (ఏఐయూ)98వ వార్షిక జనరల్ బాడీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి.

ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాధాకృష్ణన్‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ.. దేశంలో నేటితరం యువత సైంటిఫిక్‌‌‌‌‌‌‌‌ పురోగతిని కోరుకుంటోందని చెప్పారు. ఇండియన్ కల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లే ఉన్నత విద్య నేటి సమాజానికి అవసరమన్నారు. నిత్యం ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తూ, అవకాశాల వైపు దూసుకెళ్లాలని స్టూడెంట్లకు సూచించారు. రాబోయే 25 ఏండ్లలో ప్రపంచంలోనే భారత్ అగ్రగామి దేశంగా నిలుస్తుందని, దీనికి వికసిత్ భారత్ దోహదపడుతుందని ఆయన తెలిపారు. 

అందరికీ విద్యను అందించాల్సిన బాధ్యత వర్సిటీలదే..

విద్యార్థులకు మంచి భవిష్యత్ అందించే కోర్సులకు యూనివర్సిటీలు ప్రయారిటీ ఇవ్వాలని గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోరారు. ఉన్నత విద్యాసంస్థలు మంచి ప్రమాణాలు కల్పించేలా ఉండాలని, అందరికీ విద్యను అందించాల్సిన బాధ్యత వర్సిటీలు, వీసీలపై ఉందన్నారు. విద్యా రంగానికి వీసీలు చేస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. వికసిత్‌‌‌‌‌‌‌‌ భారత్‌‌‌‌‌‌‌‌ ప్రణాళికను సాధికారం చేసే దిశగా వర్సిటీలు కృషి చేయాలని ఆయన కోరారు. ఏఐసీఈటీ చైర్మన్ టీజీ సీతారామ్ మాట్లాడుతూ.. విద్యార్థులు మేథో సంపత్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉందని, దానికి అనుగుణంగా వర్సిటీలు పనిచేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఏఐయూ ప్రెసిడెంట్ జీడీ శర్మ, జనరల్ సెక్రటరీ పంకజ్ మిట్టల్, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ లింబాద్రి, వైస్ చైర్మన్ వెంకటరమణ, ఇక్ఫాయ్ వీసీ ఎల్ఎస్ గణేశ్‌‌‌‌‌‌‌‌, ఓయూ వీసీ రవీందర్ 500 మంది ఏఐయూ ప్రతినిధులు, వివిధ వర్సిటీల వీసీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 38 మంది విద్యావేత్తలు కలిసి రచించిన ‘సస్టెయినబుల్ గోల్స్’అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.