
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పంచాయతీ రాజ్ (రెండో సవరణ) చట్టం 2025, తెలంగాణ మున్సిపాలిటీ (మూడో సవరణ) బిల్లులకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోద ముద్ర వేశారు. సంగారెడ్డి జిల్లాలో ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీల ఏర్పాటుకు ఓకే చెప్పారు. అదేవిధంగా ఇస్నాపూర్ మున్సిపాలిటీ విస్తరణ, నల్గొండ జిల్లాలోని హాలియా మున్సిపాలిటీ పరిధిలోని ఇబ్రహీంపేటను నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.
వీటిపై అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్‌కు పంపగా, గురువారం ఆమోదం తెలిపారు. తర్వాత లా సెక్రటరీ పాపిరెడ్డి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పెంపునకు ఉద్దేశించిన తెలంగాణ పంచాయతీ రాజ్(మూడో సవరణ) చట్టం 2025 బిల్లును కూడా అసెంబ్లీలో ఆమోదించి పంపగా.. దానికి గవర్నర్ ఓకే చెప్పలేదు. ఈ బిల్లుకు గవర్నర్ ఓకే చెప్పారని.. 42 శాతం బీసీ రిజర్వేషన్లకు లైన్ క్లియర్ అయిందంటూ ప్రచారం జరిగింది. ఈ వార్తలను రాజ్ భవన్ కొట్టిపారేసింది.