- గూగుల్ క్లౌడ్ ద్వారా 50 వేల మందికి శిక్షణ
- ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
మేడ్చల్, వెలుగు: మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ ప్రపంచ ప్రఖ్యాత సాఫ్ట్వేర్ గూగుల్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. బుధవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మైసమ్మగూడ లోని మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ హాజరై డిజిటల్ క్యాంపస్ ఆన్ గూగుల్ క్లౌడ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ద్వారా 50 వేల మంది స్టూడెంట్స్‌కు సాంకేతిక నైపుణ్యం, ఏఐ టెక్నాలజీలో శిక్షణ, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన విద్యాసంస్థల సర్టిఫికేషన్‌లు అందించనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా గూగుల్ లోగోతో ఉన్న 50 వేల బెలూన్లు ఆకాశంలోకి ఎగరేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో గూగుల్ నుంచి వైభవ్ కుమార్ శ్రీవాస్తవ, సిద్ధార్థ్ దల్వాడి, మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూషన్స్ అధినేత చామకూర మల్లారెడ్డి, చైర్మన్ డాక్టర్ చామకూర భద్రారెడ్డి, వైస్ చైర్మన్ డాక్టర్ ప్రీతిరెడ్డి పాల్గొన్నారు.
