
తెలంగాణలో అత్యంత స్థాయిలో ఉన్న మహిళలను అవమానించిన వాళ్లను ప్రభుత్వం అందలాలు ఎక్కిస్తోందని గవర్నర్ తమిళి సై విమర్శించారు. మహిళలను అవమానించి ఆడబిడ్డలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించారు. రాజ్ భవన్ లో ఉమెన్స్ డే వేడుకలు నిర్వహించారు. పలు రంగాల్లో ప్రతిభ కనబరచిన మహిళలకు పురస్కారాలు అందచేశారు. ఉమెన్స్ డే ఒకరోజే కాకుండా ప్రతి రోజు మహిళలకు గౌరవం ఇవ్వాలన్నారు.
మెడికో విద్యార్థి ప్రీతికి జరిగిన అన్యాయంపై ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్లిన తనను అవామనించారని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను వచ్చిన ప్రాంతం విలినార్ వీర మహిళలకు ప్రసిద్ది అని...అలాంటి పరిస్థితి నుండి వచ్చిన తాను ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటానని చెప్పారు. గిరిజన మహిళలను రక్తహీనత వెంటాడుతుండే కానీ ఇపుడు అలాంటి పరిస్థితులు మారాయన్నారు. గర్భస్థ గిరిజన మహిళలు ఇబ్బందులు పడకుండా అంబులెన్స్ లను ఏర్పాటు చేశామని చెప్పారు. మహిళా దర్బార్ నిర్వహించి వారి సమస్యలను పరిష్కరించామన్నారు.