గవర్నర్ గా కాదు.. భక్తురాలిగా వచ్చిన : తమిళి సై

గవర్నర్ గా  కాదు.. భక్తురాలిగా వచ్చిన : తమిళి సై

రాష్ట్ర ప్రజల కోసం యాగం చేయడం గొప్ప విషయమని గవర్నర్ తమిళిసై అన్నారు. మేడ్చల్ జిల్లా డబీల్ పూర్ ఇస్కాన్ టెంపుల్  లో మహా సదర్శన నర్సింహ హోమానికి గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడిన గవర్నర్.. చెన్నై నుండి యాగం కోసం ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చానని చెప్పారు.  యాగంకి రావడం., అందరిని కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. మహా సుదర్శన నర్సింహ హోమంలో పాల్గొనడం తన అదృష్టమని చెప్పారు.

 ఈ ఊరికి గవర్నర్  రావడం మొదటి సారని.. తానే ఫస్ట్ టైం రావడం ఇంకా సంతోషంగా ఉందని గవర్న్ తమిళి సై  అన్నారు. గవర్నర్ గా రాలేదని. భక్తురాలిగా వచ్చానని అన్నారు. దేశ., భక్తుల ఈలవేల్పు నర్సింహాస్వామి కోరిన కోరికలు తీరుస్తారన్నారు. కరోనా టైంలో ఇస్కాన్  ఎన్నో సామాజిక కార్యక్రమాలు.. సేవలు చేశారన్నారు. ప్రజలందరూ సంతోషంగా ఆరోగ్య ఉండాలని కోరారు.