Chiranjeevi : 'విశ్వంభర' VFX అదుర్స్.. విడుదలకు చిరు నుంచి గ్రీన్ సిగ్నల్!

Chiranjeevi :  'విశ్వంభర' VFX అదుర్స్.. విడుదలకు చిరు నుంచి గ్రీన్ సిగ్నల్!

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా  తెరకెక్కుతున్న చిత్రం  'విశ్వంభర' (Vishvambhara) .  వశిష్ట దర్శకత్వంలో వస్తున్న ఈ  భారీ సోషియో-ఫాంటసీ చిత్రం ఈ చిత్రం నిర్మాణ దశలో చాలా కాలంగా ఉంది.  దీనిపై అంచనాలు భారీగా ఉన్నప్పటికీ, ప్రపంచ స్థాయి VFX పనుల కారణంగా విడుదల వాయిదా పడుతూ వచ్చింది.  అయితే, దీనికి సంబంధించిన  అప్‌డేట్ మెగా అభిమానులకు పెద్ద పండుగ లాంటిదే. సినిమాలోని అద్భుతమైన విజువల్స్ వచ్చాయ ని, స్వయంగా మెగాస్టార్‌ చిరంజీవి పరిశీలించి  ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది


మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా  తెరకెక్కుతున్న చిత్రం  'విశ్వంభర' (Vishvambhara) .  ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.  వశిష్ట దర్శకత్వంలో వస్తున్న ఈ  భారీ సోషియో-ఫాంటసీ చిత్రం ఈ చిత్రం నిర్మాణ దశలో చాలా కాలంగా ఉంది.  దీనిపై అంచనాలు భారీగా ఉన్నప్పటికీ, ప్రపంచ స్థాయి VFX పనుల కారణంగా విడుదల వాయిదా పడుతూ వచ్చింది.  అయితే, దీనికి సంబంధించిన  అప్‌డేట్ మెగా అభిమానులకు పెద్ద పండుగ లాంటిదే. సినిమాలోని అద్భుతమైన విజువల్స్ వచ్చాయ ని, స్వయంగా మెగాస్టార్‌ చిరంజీవి పరిశీలించి  ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.

చిరు గ్రీన్ సిగ్నల్.. VFX అదుర్స్!
వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక 'విశ్వంభర'చిత్రంలో చిరంజీవిని మరోసారి అద్భుతమైన, పవర్‌ఫుల్ అవతార్‌లో చూపింననున్నారు. ఈ సినిమాలోని విస్తృతమైన సీజీఐ (CGI) పనులు దాదాపు పూర్తియనట్లు తెలుస్తోంది. ఇటీవల, చిరంజీవి స్వయంగా సినిమా తుది కట్‌ను వీక్షించినట్లు సమాచారం.  విజువల్స్ నాణ్యతకు మెగాస్టార్ ఎంతగానో థ్రిల్ అయ్యారని తెలుస్తోంది. సాంకేతిక బృందాన్ని చిరంజీవి ఎంతగానో అభినందించారని, సినిమా తదుపరి విడుదల ప్రణాళికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. VFX పనులు సంపూర్ణంగా పూర్తయ్యే వరకు సినిమా విడుదల తేదీని ఖరారు చేయవద్దని గతంలో మూవీ  టీమ్‌కు సూచించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో VFX ఆమోదం కోసం విజువల్స్ ను మరోసారి చిరుకు చూపించినట్లు టాక్.  దీంతో వాటిని వీక్షించిన చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

ALSO READ : Rashmika Mandanna: అలాంటి వ్యక్తితో డేటింగ్‌కు ఓకే అంటున్న రష్మిక!

అంతర్జాతీయ ప్రమాణాలతో VFX:
'విశ్వంభర' చిత్రానికి సంబంధించిన VFX అత్యంత చర్చనీయాంశమైంది. ఈ సినిమా కోసం హాలీవుడ్, బాలీవుడ్ సహా ప్రపంచంలోని అగ్రశ్రేణి VFX కళాకారులు, సాంకేతిక నిపుణులు కలిసి పనిచేశారు. చిత్రానికి అవసరమైన ఫాంటసీ ప్రపంచాన్ని సృష్టించడానికి ప్రతి ఒక్కరూ తమ నైపుణ్యాన్ని, ప్రతిభను అందించారు. ఈ స్థాయిలో అంతర్జాతీయ సహకారం తీసుకోవడం వల్లనే సినిమా విజువల్స్ ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని తెలుస్తోంది. ఇది భారతీయ సినిమా VFX స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్తుందని అంచనా వేస్తున్నారు. 

 

ప్రమోషనల్ యాక్టివిటీస్ షురూ!
చిరంజీవి నుండి తుది ఆమోదం లభించడంతో, మేకర్స్ ఇప్పుడు ప్రమోషనల్ యాక్టివిటీలను ప్లాన్ చేయడానికి సిద్ధమవుతున్నారు. రాబోయే వారాల్లో టీజర్ విడుదల, పాత్రల పరిచయం, పాటల ప్రోమోలు వంటివి ఆశించవచ్చని తెలుస్తోంది. బహుళ భాషల్లో భారీ మార్కెటింగ్ ప్రచారానికి టీం సన్నాహాలు చేస్తోంది. ఈ 'విశ్వంభర' చిత్రంలో చిరంజీవి పక్కన త్రిష కృష్ణన్ (Trisha Krishnan) కథానాయికగా నటిస్తోంది. అలాగే, కునాల్ కపూర్ (Kunal Kapoor)  ఆశిక రంగనాథ్ (Ashika Ranganath) కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి (M.M. Keeravani) సంగీతం అందిస్తున్నారు. ఛోటా కె. నాయుడు (Chota K. Naidu) సినిమాటోగ్రఫీ, కొటగిరి వెంకటేశ్వర రావు (Kotagiri Venkateswara Rao)   సంతోష్ కామిరెడ్డి (Santhosh Kamireddy) ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. భారీ తారాగణం, ప్రపంచ స్థాయి సాంకేతిక నిపుణులతో రూపొందుతున్న 'విశ్వంభర' బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని మెగా అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.