
వరుస సినిమా ఆఫర్స్ తో ఫుల్ జోరులో ఉంది నేషనల్ క్రష్ రష్మిక మందన (Rashmika Mandanna) . ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో నాలుగైదు చిత్రాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన ' కుబేరా ' మూవీ గ్రాండ్ సక్సెస్ తో మరింత క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఇటీవల ఓ ఇంటర్యూలో ఈ బ్యూటీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ' యానిమల్ ' (Animal) మూవీలోని హీరో లాంటి వ్యక్తితో డేటింగ్ చేయడానికి తనకు అభ్యంతరం లేదని రష్మిక చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రేమపై తనకు ఉన్న అభిప్రాయాన్ని కూడా పంచుకుంది.
ఆలాంటి వ్యక్తితో డేటింగ్ కు ఒకే..
రష్మిక నటించిన ఈ ‘యానిమల్’ ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుంది.. అదే స్థాయిలో ఆమెపై విమర్శలు కూడా వచ్చాయి. నిజ జీవితంలో 'యానిమల్' సినిమాలోని హీరో పాత్ర స్వభావం ఉన్న వ్యక్తితో మీరు డేటింగ్ చేస్తారా? అతడిలో మార్పు తీసుకురాగలరా? అని అడిగిన ప్రశ్నకు రష్మిక ఆసక్తి కరంగా ఓకే చెప్పింది. "మనం ఎవరినైనా ఎక్కువగా ప్రేమిస్తే.. మనల్ని ఎవరైనా గాడంగా ప్రేమిస్తే.. మార్పు కచ్చితంగా జరుగుతుందని తాను నమ్ముతున్నట్లు చెప్పుకొచ్చారు. భాగస్వామితో కలిసి జీవితాన్ని పంచుకుంటున్నప్పుడు ఇద్దరి వ్యక్తిత్వాల్లో మార్పు తప్పక వస్తుంది అని అన్నారు. ఒకే చోట కలిసి ఉండటం వల్ల ఒకరికి ఒకరు అభిప్రాయలు, ఇష్టాయిష్టాలు తెలుసుకుంటారు. ఒకరి కోసం ఒకరు మారతారు . ఈ మార్పు ఒక్కోసారి ఆశ్చర్యానికి గురిచేస్తుందని చెప్పుకొచ్చారు. ఇది తాను అర్థం చేసుకునే భాగస్వామి గురించి మాత్రమే చెబుతున్నట్లు స్పష్టం చేశారు.
విజయ్ తో ప్రేమ వ్యవహారంపై పరోక్ష సూచనలా?
రష్మిక వ్యాఖ్యలు సహజంగానే విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)తో ఆమెకున్న ప్రేమ వ్యవహారంపై వస్తున్న వార్తలను గుర్తు చేస్తున్నాయి. రష్మిక, విజయ్ దేవరకొండ మధ్య ప్రేమాయణం నడుస్తోందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ పలు సందర్భాల్లో కలిసి కనిపించడం, ఒకరి గురించి మరొకరు ప్రశంసించుకోవడం వంటివి ఈ ఊహాగానాలకు బలం చేకూర్చాయి. రష్మిక ప్రస్తుతం ప్రేమ పట్ల, భాగస్వామిలో మార్పు తీసుకురావడంపై మాట్లాడిన తీరు, విజయ్ దేవరకొండతో ఆమెకున్న బంధంపై పరోక్షంగా సూచిస్తోందని చాలా మంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఒకరి కోసం ఒకరు మారడం, అభిప్రాయాలు పంచుకోవడం వంటి అంశాలు వారిద్దరి మధ్య ఉన్న స్నేహానికి మించిన అనుబంధాన్ని సూచిస్తున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే, రష్మిక గానీ, విజయ్ దేవరకొండ గానీ తమ బంధంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
రష్మిక బిజీ షెడ్యూల్:
ప్రస్తుతం రష్మిక వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయుష్మాన్ ఖురానాతో కలిసి 'థామా' అనే హారర్ కామెడీలో నటిస్తున్నారు. దీనితో పాటు 'ది గర్ల్‌ఫ్రెండ్' చిత్రంతో సిద్ధమవుతున్నారు. తాజాగా 'మైసా' అనే చిత్రాన్ని కూడా ప్రకటించారు. అలాగే, అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించనున్న సినిమాలోనూ ఈ అమ్మడు కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కెరీర్ పరంగా దూసుకుపోతున్న రష్మిక, తన వ్యక్తిగత జీవితంపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది.