
ఉద్యోగుల తొలగింపులు ఈ ఏడాదిలో ఆగేల లేదు. కరోనా లాక్ డౌన్ సమయంలో మొదలు పెట్టిన ఉద్యోగాల కోతలు నేటికీ ఐటి రంగాన్ని పట్టి పీడిస్తున్నాయి. పెద్ద పెద్ద కంపెనీల నుండి చిన్న కంపెనీలు, స్టార్టప్లు కూడా ఉద్యోగులను తొలగించిన కంపెనీల లిస్టులో చేరాయి.
దీనికి తోడు తాజగా భారతదేశానికి చెందిన ఒక ఐటీ స్టార్టప్ కంపెనీ రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసింది. అలాగే 19 మంది ఉద్యోగులను వీడియో కాల్ ద్వారా తొలగించి సంచలనం రేపింది. ఈ ఘటనపై రెడ్డిట్‌లో ఒక పోస్ట్ వైరల్‌గా అవడంతో ఆన్‌లైన్‌లో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఒక పోస్ట్‌లో ఉద్యోగి తన అనుభవాన్ని షేర్ చేస్తూ నాలుగు సంవత్సరాల ఈ స్టార్టప్ కంపెనీ సీఈఓ ఒక వీడియో కాల్ మీటింగ్ పెట్టి కంపెనీ డబ్బులు అయిపోయాయని, వెంటనే మూసివేస్తున్నామని చెప్పారట. క్లౌడ్/చాట్‌బాట్ నిర్వహణకు సంబంధించిన ఈ కంపెనీ మూసేస్తున్నట్లు ముందస్తు హెచ్చరికలు లేవని, 19 మంది ఉద్యోగులలో ఎవరూ ఈ తొలగింపులు ఊహించలేదని రెడ్డీస్ యూజర్ తెలిపారు.
ఈ స్టార్టప్ కంపెనీలో ఎప్పటిలాగే ఒక రోజు మధ్యాహ్నం సమయంలో మా అందరికీ సీఈఓ నుండి అత్యవసరంగా అందరూ మీటింగులో పాల్గొనాలి అని ఇమెయిల్ వచ్చింది. అప్పుడు మాలో ఎవరూ ఊహించని విషయాన్ని అయన చెప్పారు. ఏంటంటే కంపెనీ డబ్బు పూర్తిగా అయిపోయింది. ఈ నెలలో జీతం రాదు, అలాగే కంపెనీ మూసివేయనుంది. పెట్టుబడిదారులందరూ బయటకు వెళ్ళిపోయారు. రేపటి రోజు ఆఫీస్ రావద్దని మాకు చెప్పారు అని ఓ ఉద్యోగి తెలిపారు.
ALSO READ : నిరుద్యోగులకు మంచి ఛాన్స్.. బ్యాంకులో క్లరికల్ ట్రైనీ పోస్టులు.. స్టైఫండ్ కూడా..
నాలుగు సంవత్సరాల ఈ స్టార్టప్ ఒకేసారి మూతపడింది. నాతో సహా 19 మందికి ఉద్యోగం లేకుండా పోయింది. ఇది పూర్తిగా షాకింగ్‌గా ఉంది. మాకు ఎటువంటి ముందస్తు హెచ్చరిక కూడా లేదు. గతంలో ఉద్యోగుల తొలగింపులు కానీ, ఆర్థిక సహాయం లేదు. అసలు నిజంగా దీని గురించి ఎటువంటి సమాచారం లేదు అని మరో ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు.