నిరుద్యోగులకు మంచి ఛాన్స్.. బ్యాంకులో క్లరికల్ ట్రైనీ పోస్టులు.. స్టైఫండ్ కూడా..

నిరుద్యోగులకు మంచి ఛాన్స్.. బ్యాంకులో  క్లరికల్ ట్రైనీ పోస్టులు.. స్టైఫండ్ కూడా..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  విశాఖపట్టణం కో–ఆపరేటివ్ బ్యాంక్ క్లరికల్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జులై 16.

పోస్టులు: 45 (క్లరికల్ ట్రైనీ)

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఫస్ట్ డివిజన్​లో ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. తెలుగు, ఇంగ్లిష్ నాలెడ్జ్ తప్పనిసరి. ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్​లో ప్రావీణ్యం కలిగి ఉండాలి. 

వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 30 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్లు ప్రారంభం: జూన్ 13

లాస్ట్ డేట్: జులై 16. 

అప్లికేషన్ ఫీజు: అన్ని కేటగిరీల అభ్యర్థులకు రూ.100

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ట్రైనింగ్ సమయం: 24 నెలలు. ట్రైనింగ్ సమయంలో మొదటి సంవత్సరం ప్రతి నెల రూ.15,000, రెండో సంవత్సరం ప్రతి నెల రూ.17,000  స్టైఫండ్ చెల్లిస్తారు.  విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులను రెగ్యులర్ బేస్డ్​పై ఉద్యోగంలోకి తీసుకుంటారు.

►ALSO READ | ఏవియేషన్ సర్వీసెస్లో ఉద్యోగాలు.. ఇంటర్ ఉంటే చాలు.. మంచి జీతం కూడా..