ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్&వాట్సాప్? దేనిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారో తెలుసా ?

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్&వాట్సాప్? దేనిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారో తెలుసా ?

ఈ కాలం ఇంటర్నెట్ వాడని వారు, స్మార్ట్ ఫోన్ లేని వారు ఉన్నారంటే నమ్మడం కష్టం. టెక్నాలజీ వేగంగా పెరుగుతున్న కొద్దీ ప్రజలు దానిని త్వరగా అలవాటు చేసుకోవడం కూడా స్టార్ట్ చేస్తున్నారు.  అయితే 2025లో ఇంటర్నెట్‌ను ఉపయోగించే వారి సంఖ్య భారీగా పెరిగింది. ఈ ఏడాది ప్రారంభంలోనే ప్రపంచవ్యాప్తంగా 556 కోట్ల మంది ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నారని రిపోర్ట్స్  సూచిస్తున్నాయి. అయితే 2024తో పోల్చి చూస్తే 136 కోట్లు పెరిగింది. భారతదేశంలో అత్యధికంగా చూసే వెబ్‌సైట్‌లలో ముఖ్యంగా సెర్చ్ ఇంజన్లు, సోషల్ మీడియా యాప్స్, వీడియో షేరింగ్ సైట్‌లు అలాగే  ఇ-కామర్స్ సైట్స్  ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.

Google.com స్థిరంగా అత్యధికంగా సందర్శించే వెబ్‌సైట్‌గా ర్యాంక్ పొందింది, తర్వాత YouTube ఉంది. Instagram, Facebook సహా WhatsApp వంటి సోషల్ మీడియా దిగ్గజాలు కూడా టాప్ ప్లేస్లో ఉన్నాయి. Amazon, Flipkart వంటి E-కామర్స్ సైట్స్ కూడా భారీ  ట్రాఫిక్‌ను ఆకర్షిస్తున్నాయి. 

మార్చి 2025లో SEMrush రిపోర్ట్ ప్రకారం, భారతీయులు మొబైల్ ఫోన్లలో అత్యధికంగా సందర్శించే వెబ్‌సైట్ Google. ఇటీవలి కాలంలో వినియోగం భారీగా పెరిగిన సెర్చ్ ఇంజిన్ కూడా గూగుల్. రిపోర్ట్  ప్రకారం, మార్చిలో ఈ సెర్చ్ ఇంజిన్‌ సందర్శించిన వారి సంఖ్య 10,360,865,830కి చేరుకుంది.

కొన్ని ముఖ్య వివరాలు చూస్తే :

* భారతీయులు మొబైల్ ఫోన్లలో ఎక్కువగా  ఓపెన్ చేసే వెబ్‌సైట్ గూగుల్.

* డేటా ప్రకారం, భారతీయులు మొబైల్ ఫోన్లలో అత్యధికంగా చూసే రెండవ సైట్ YouTube.

* రిపోర్ట్స్ ప్రకారం, మార్చిలో YouTubeని చుసిన వారి సంఖ్య 5,703,994,371.

* ప్రజలు ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ క్రియేట్ చేయడానికి  మాత్రమే కాకుండా వాటిని చూడటానికి, ఎంటర్టైన్మెంట్ కోసం కూడా ఉపయోగిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్ యాక్టివిటీ కూడా రోజురోజుకూ పెరుగుతోంది.

* మార్చి నెలలో వచ్చిన ఒక రిపోర్ట్  ప్రకారం, మార్చి నెలలో 986,251,232 మంది ఇన్‌స్టాగ్రామ్‌ను సందర్శించారు.

* మార్చిలో 746,995,837 మంది ఫేస్‌బుక్‌ను సందర్శించారు.

* AI నిస్సందేహంగా చాలా కొత్త ఫీచర్, కానీ తరువాత ChatGPT వాడకం ప్రజలలో ఎక్కువగా పెరుగుతోంది.

* నివేదికల ప్రకారం, మార్చిలో ChatGPT సందర్శనల సంఖ్య 538,605,211కి పెరిగింది, ఫిబ్రవరి నెలతో పోలిస్తే  ఒక అడుగు ముందుకే  వేసింది.

* వాట్సాప్ ప్రజలకు ఎన్నో కీలక   పనులను చాలా ఈజీ చేసింది. మార్చిలో వాట్సాప్‌ కొత్త సందర్శకుల సంఖ్య 531,681,643గా రికార్డింది.