డ్యూటీకి వెళ్తూ.. హోంగార్డు గుండెపోటుతో మృతి

డ్యూటీకి వెళ్తూ.. హోంగార్డు గుండెపోటుతో మృతి

నల్లగొండ జిల్లాలో విషాదం నెలకొంది. విధులు నిర్వహించేందుకు వెళ్తున్న హోంగార్డు గుండెపోటుతో మృతిచెందారు.నాగార్జున సాగర్ లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు కిషన్ గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. వివరాల్లకి వెళితే.. 

ఆదివారం(జూలై13) నాగార్జున సాగర్ లోని విజయపురి టౌన్ పోలీస్ స్టేషన్ లో విధి నిర్వహిస్తున్న హోంగార్డు కిషన్ గుండెపోటుతో మృతిచెందారు. ఇంటినుంచి డ్యూటీకి వెళ్తున్న కిషన్ మార్గమధ్యలో గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు.గమనించిన  స్థానికులు కిషన్ ను స్థానిక కమలా నెహ్రూ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కిషన్ మృతిచెందారు. 

ఇటీవలి కాలంలో గుండెపోటు మరణాలు, ముఖ్యంగా యువతలో కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగించే విషయం. ఒకప్పుడు 60 ఏళ్లు పైబడిన వారిలో కనిపించే ఈ సమస్య ఇప్పుడు చిన్న వయసులోనే, కొన్నిసార్లు 25 ఏళ్లలోపు వారిలో కూడా వస్తోంది. 

భారతదేశంలో గుండెపోటు మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా 40 ఏళ్లలోపు వారిలో ఆకస్మిక గుండెపోటు మరణాలు అధికమయ్యాయి. రిపోర్టుల ప్రకారం..ముంబైలో గడచిన నాలుగేళ్లలో అత్యధికంగా మరణాలు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా గుండెపోటుతో మరణించి వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.

గుండెపోటు లక్షణాలను గుర్తించడం, వెంటనే వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు డాక్టర్లు. ఛాతీ నొప్పి, ఊపిరి ఆడకపోవడం, వికారం, మూర్ఛగా అనిపించడం, చల్లని చెమట, అలసట, చేయి, మెడ, వీపు, దవడ, కడుపుల్లో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలంటున్నారు.