Airtel కొత్త ఆఫర్: రూ.349 ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ 5G డేటా.. Jio, Viలకు షాక్!

Airtel కొత్త ఆఫర్: రూ.349 ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ 5G డేటా.. Jio, Viలకు షాక్!

Airtel Unlimited 5G: టెలికాం రంగంలో పోటీ పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రముఖ టెలికాం ఆపరేటర్ ఎయిర్‌టెల్ తన వినియోగదారులను ఆకట్టుకునేందుకు మరో సంచలన ఆఫర్‌ను ప్రకటించింది. కేవలం రూ.349 ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ 5G డేటాను అందిస్తున్నట్లు వెల్లడించింది. గతంలో రూ.379 ప్లాన్‌తో ఈ అన్‌లిమిటెడ్ 5G డేటా ఆఫర్‌ అందుబాటులో ఉండేది. తాజాగా కంపెనీ రూ.30 తక్కువ రేటుకే 5జీ డేటాతో ప్లాన్ తీసుకురావటం.. జియో, వొడాఫోన్ ఐడియా వంటి ప్రత్యర్థులకు గట్టి పోటీనిస్తోంది. 

రూ.349 ప్లాన్‌లో లభించే ప్రయోజనాలు:
ఎయిర్‌టెల్ రూ.349 ప్లాన్ కేవలం అన్‌లిమిటెడ్ 5G డేటాతో పాటు, అనేక ఆకర్షణీయమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. అలాగే ప్లాన్ కింద5G నెట్‌వర్క్ ఉన్న ప్రాంతాలలో 5G ఎనేబుల్డ్ ఫోన్ ఉన్న వినియోగదారులు అదనపు ఛార్జీలు లేకుండా అపరిమిత 5G డేటాను ఉపయోగించుకోవచ్చు. ఇది మీ రోజువారీ ప్లాన్ డేటా లిమిట్ అయిపోయిన తర్వాత కూడా వర్తిస్తుంది. అయితే ఈ అన్‌లిమిటెడ్ 5G డేటా కేవలం 5G నెట్‌వర్క్ కవరేజ్ ఉన్న ప్రాంతాల్లో మాత్రమే లభిస్తుంది. దీని కింద మొబైల్ హాట్‌స్పాట్ ద్వారా డేటా షేరింగ్ అనుమతించబడదని యూజర్లు గుర్తుంచుకోవాలి.

ALSO READ | అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ మోసాలిలా.. సైబర్ మోసాలను తప్పించుకునే టిప్స్ మీకోసం..

దీనికి తోడు 28 రోజుల కాలంలో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ ఉచితంగా 100 ఎస్ఎమ్ఎస్ లు, డెయిలీ 2జీబీ వరకు డేటాను ఆఫర్ చేస్తోంది. అంటే ఎవరైనా వినియోగదారులు 5జీ నెట్ వర్క్ అందుబాటులో లేని ప్రాంతంలో ఉన్నప్పుడు వారు రోజూ పరమితి కింద 2జీబీ వరకు 4జీ ఇంటర్నెట్ సేవలను పొందగలరు. అలాగే 30 రోజుల కాలానికి ఒక ఉచిత కాలర్ ట్యూన్ సెట్ చేసుకునేందుకు ప్లాన్ అనుమతిస్తోంది. రీఛార్జ్ చేసుకున్న తర్వాత ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ లోకి వెళ్లి "అన్‌లిమిటెడ్ 5G డేటా" ఆఫర్‌ను యూజర్లు క్లెయిమ్ చేసుకోవాలి. ఈ చర్యలు ఎక్కువ మందిని 5జీ సేవల వైపు మళ్లేలా ఆకర్షిస్తుందని కంపెనీ భావిస్తోంది. 

అంబానీకి చెందిన టెలికాం సంస్థ జియో ఇప్పటికే తన 5G వెల్‌కమ్ ఆఫర్ కింద అపరిమిత 5G డేటాను మెుబైల్ యూజర్లకు అందిస్తోంది. ఇప్పుడు ఎయిర్‌టెల్ కూడా తక్కువ ధరలో అన్‌లిమిటెడ్ 5G డేటాను అందించడం ద్వారా 5G మార్కెట్‌లో పోటీని మరింత పెంచింది. భవిష్యత్తులో ఇతర టెలికాం ఆపరేటర్లు కూడా ఇలాంటి ఆకర్షణీయమైన 5G ప్లాన్‌లను ప్రకటించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.