ఒకే ఫ్రేమ్​లో గవర్నర్​, సీఎం.. సచివాలయంలో ప్రార్థనా మందిరాలు ప్రారంభం

ఒకే ఫ్రేమ్​లో గవర్నర్​, సీఎం..  సచివాలయంలో ప్రార్థనా మందిరాలు ప్రారంభం

తెలంగాణ గవర్నర్​ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్​ ఒకే ఫ్రేమ్​లో కనిపించారు. సెక్రటేరియట్ ఆవరణలో నిర్మించిన ప్రార్థనా మందిరాల ప్రారంభోత్సం దీనికి వేదిక అయింది. 

సచివాలయం ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన దేవాలయం, మసీదు, చర్చిలను ఇరువురు ఆగస్టు 25న ప్రారంభించారు. తొలుత నల్ల పోచమ్మ ఆలయానికి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. 

బ్రాహ్మణుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. అనంతరం చర్చిని గవర్నర్, సీఎం​ ప్రారంభించారు. పాస్టర్ల ఆశీర్వచనాలు అందుకున్నారు. అనంతరం అటు పక్కే నిర్మించిన మసీదుని ప్రారంభించి.. ముస్లీం మత పెద్దల ఆశీర్వాదాలు అందుకున్నారు. 

కొత్త సెక్రటేరియట్ నిర్మించిన తరువాత ఇప్పటివరకు గవర్నర్​ సచివాలయాన్ని సందర్శించలేదు.  దాదాపు రెండేళ్ల తరువాత తమిళిసై ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారు.  

ప్రార్థనా మందిరాల ప్రారంభోత్సవం అనంతరం తమిళిసై సీఎం కార్యాలయంతో పాటు ఆఫీసర్ల ఛాంబర్లు పరిశీలించనున్నారు.