నిర్మలా సీతారామన్ ‘అమృత్ కాల్’ బడ్జెట్​ను ప్రవేశ పెట్టారు: గవర్నర్ తమిళిసై

నిర్మలా సీతారామన్ ‘అమృత్ కాల్’ బడ్జెట్​ను ప్రవేశ పెట్టారు:  గవర్నర్ తమిళిసై

న్యూఢిల్లీ, వెలుగు : కేంద్రం ప్రవేశపెట్టిన 2023– 24 ఆర్థిక బడ్జెట్ ను విజన్ బడ్జెట్ గా గవర్నర్ తమిళిసై అభివర్ణించారు. ఆదివారం మధ్యాహ్నం చెన్నై నుంచి నేరుగా ఆమె ఢిల్లీ వెళ్లారు. తర్వాత సౌత్ బ్లాక్ లో నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. 15 నిమిషాలకు పైగా సాగిన ఈ మీటింగ్​లో.. తెలంగాణ, పుదుచ్చేరికి సంబంధిం చిన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఇటీవల పార్లమెంట్ లో 2023–24 ఆర్థిక బడ్జెట్​ను ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్​కు తమిళిసై అభినందనలు తెలిపారు.

మోడీ దూర దృష్టి, కరోనా తర్వాత ఎదురైన సవాళ్ల మధ్య భవిష్యత్ ఆర్థిక వృద్ధి దిశగా ఆర్థిక మంత్రి ‘అమృత్ కాల్’ బడ్జెట్​ను ప్రవేశ పెట్టారన్నారు. తెలంగాణ, పుదుచ్చేరి ఫ్యూచర్ డెవలప్​మెంట్ ప్లాన్స్ (భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలను) సమర్పించారు. కేంద్రం నిధులతో తెలంగాణ, పుదుచ్చేరిలో అమలవుతున్న ప్రాజెక్టులపై చర్చించారు. తర్వాత జవహార్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన బీజేపీ చీఫ్ జేపీ నడ్డా కొడుకు రిసెప్షన్​కు అటెండ్​ అయ్యారు. అనంతరం హైదరాబాద్ వచ్చేశారు.