వరద బాధితులకు సహాయం చేయండి..రెడ్ క్రాస్ వలంటీర్లకు గవర్నర్ సూచన

వరద బాధితులకు సహాయం చేయండి..రెడ్ క్రాస్ వలంటీర్లకు గవర్నర్ సూచన

హైదరాబాద్, వెలుగు :  వరద ప్రభావిత ప్రాంతాల్లో  బాధితులకు సహాయం చేయాలని రెడ్ క్రాస్ యూనిట్లకు గవర్నర్ తమిళిసై సూచించారు. నిత్యావసర వస్తువులు, అన్నదాన కార్యక్రమాలు చేయాలని, దుప్పట్లు అందజేయాలన్నారు.  గత కొద్ది రోజులుగా రాష్ర్టంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని పలు కాలనీలు , ఇండ్లు నీటిలో చిక్కుకున్నాయని గవర్నర్ గుర్తు చేశారు.  బుధవారం రాజ్ భవన్ నుంచి అన్ని జిల్లాల రెడ్ క్రాస్ యూనిట్, స్టేట్ బ్రాంచ్  నిర్వాహకులతో గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  కంట్రోల్ రూమ్ లు, హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేయాలన్నారు.  ప్రభుత్వ అధికారులకు  సహాయ సహాకారాలు అందజేయాలన్నారు. గత వరదల టైమ్ లో రెడ్ క్రాస్ యూనిట్లు సమర్థవంతంగా పనిచేశాయని గవర్నర్ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్, రెడ్ క్రాస్ నిర్వాహకులు అజయ్ మిశ్రాతో పాటు పలువురు పాల్గొన్నారు. కాగా కృష్ణాష్టమి సందర్భంగా రాష్ర్ట ప్రజలకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. కృష్ణుడి జీవితం ఎన్నో తరాలకు ఆదర్శమన్నారు.

గవర్నర్ తమిళిసై @4 ఏండ్లు

తెలంగాణ గవర్నర్​గా తమిళిసై ఈ నెల 9తో 4 ఏండ్ల టర్మ్​ను పూర్తి చేసుకోనున్నారు. ఈ సందర్భంగా 2019 సెప్టెంబర్ 9న ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి.. గవర్నర్ గా తన అనుభవాలు, చేపట్టిన టూర్లు, కార్యక్రమాలను వివరిస్తూ రూపొందించిన కాఫీ టేబుల్ బుక్ ను ఆమె శుక్రవారం రిలీజ్ చేయనున్నారు. ఏటా గవర్నరే ఈ బుక్ ను విడుదల చేస్తున్నారు.