స్టూడెంట్స్ ను భయపెట్టొదు ..హేమంత్ మృతి బాధాకరం: గవర్నర్

స్టూడెంట్స్ ను భయపెట్టొదు ..హేమంత్ మృతి బాధాకరం: గవర్నర్


హైదరాబాద్ ,వెలుగు: టీచర్లు అంటే స్టూడెంట్స్ కు రోల్ మోడల్ గా ఉండాలని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. టీచర్లను చూస్తే స్టూడెంట్స్ భయపడేలా ఉండొద్దని సూచించారు. రామంతాపూర్ లో టీచర్ కొట్టడంతో స్టూడెంట్ మృతి చెందిన ఘటనపై మంగళవారం గవర్నర్ తమిళిసై స్పందించి తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ.. ప్రెస్ నోట్ విడుదల చేశారు.

హేమంత్ కుటుంబానికి తన ప్రగాఢ సంతాపం తెలిపారు. స్కూల్ వాతావరణం పిల్లలకు నచ్చే విధంగా,  భద్రత కల్పించే విధంగా ఉండాలన్నారు. టీచర్ వృత్తి చాలా గొప్పదని,   ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చూడాలని టీచర్లను గవర్నర్  కోరారు.