ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకం పెంచాలె : తమిళిసై

ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకం పెంచాలె : తమిళిసై
  • ఈ–20 సదస్సులో గవర్నర్

హైదరాబాద్, వెలుగు: నీటిని సంరక్షించుకోవడంతో పాటు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించాలని గవర్నర్ తమిళిసై అన్నారు. పునరుత్పాదక ఇందన వనరులు, ఎలక్టిక్‌ వాహనాల వినియోగం పెంచాలని సూచించారు. పరిశ్రమల రంగంలో నెట్ జీరోను సాధించేందుకు ఇవే దోహదం చేస్తాయని తెలిపారు. దేశ జనాభా పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారించాలన్నారు.  “టువర్డ్స్ నెట్ జీరో ఇన్ ది ఇండస్ర్టియల్ సెక్టార్ ఇన్ జీ20” అనే అంశంపై శుక్రవారం గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ లో జరిగిన ఈ–20 సమ్మిట్ లో గవర్నర్ పాల్గొని మాట్లాడారు. 

ఈ–20 సదస్సులో వచ్చే రెకమండేషన్లను జీ20 ఎజెండాలో చేర్చనున్నట్లు ఆమె తెలిపారు. శ్రావణ మాసంలో తొలి శుక్రవారం సందర్భంగా చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్​ను దర్శించుకున్నానని.. తెలంగాణ, పుదుచ్చేరితోపాటు దేశ ప్రజలకు మంచి జరగాలని కోరుకున్నట్లు చెప్పారు. చంద్రయాన్ 3 మిషన్ సక్సెస్‌పై ఇస్రో శాస్ర్తవేత్తలకు గవర్నర్ ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. ఈ ప్రయోగంలో స్పేస్ క్రాఫ్ట్, లాంచ్ వెహికల్ అభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషించిందన్నారు.