రాజ్​భవన్​లో సిక్కిం ఆవిర్భావ వేడుకలు

రాజ్​భవన్​లో సిక్కిం ఆవిర్భావ వేడుకలు

రాజ్​భవన్​లో సిక్కిం ఆవిర్భావ వేడుకలు

ఆ రాష్ట్ర ప్రజలు ప్రకృతి ప్రేమికులు : గవర్నర్

హైదరాబాద్, వెలుగు : దేశంలో సిక్కింకు ప్రత్యేక సాంస్కృతిక గుర్తింపు, చారిత్రక వారసత్వం  ఉందని, ఆ రాష్ట్ర ప్రజలు ప్రకృతి ప్రేమికులని గవర్నర్ తమిళిసై అన్నారు. మంగళవారం రాజ్ భవన్ లో సిక్కిం ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో గవర్నర్ పాల్గొని మాట్లాడారు. దేశంలోని  అన్ని రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవాలు రాజ్ భవన్ లలో నిర్వహించాలనేది ప్రధాని మోడీ విజన్ అని గవర్నర్ గుర్తు చేశారు. ఈ వేడుకలు ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్ స్ఫూర్తిని చాటి చెబుతాయన్నారు. సిక్కిం గవర్నర్ గా పనిచేసిన తెలంగాణకు చెందిన దివంగత వి రామారావు సేవలను ఈ సందర్భంగా తమిళిసై గుర్తు చేశారు. 

ఇయ్యాల భద్రాచలం, ఖమ్మంలో పర్యటన

గవర్నర్ తమిళిసై బుధవారం భద్రాచలం, ఖమ్మంలో పర్యటించనున్నారు. మంగళవారం రాత్రి సికింద్రాబాద్ నుంచి మణుగూరు ఎక్స్ ప్రెస్ లో కొత్తగూడెం చేరుకొని అనంతరం భద్రాచలం వెళ్లనున్నారు. భద్రాచలంలో జిల్లా రెడ్ క్రాస్ కాన్ఫరెన్స్ లో పాల్గొని తరువాత ఖమ్మం చేరుకోనున్నారు.