దివ్యాంగులకు కావాల్సింది మద్దతు, ప్రోత్సాహం

దివ్యాంగులకు కావాల్సింది మద్దతు, ప్రోత్సాహం

గచ్చిబౌలి, వెలుగు: దివ్యాంగులకు కావాల్సింది సానుభూతి కాదని.. మద్దతు, ప్రోత్సాహం అని గవర్నర్ తమిళిసై అన్నారు. అన్ని రంగాల్లో సమాన అవకాశాలు, వనరులు ఇవ్వాలని అభిప్రాయప డ్డారు. దివ్యాంగులకు మనోధైర్యం ఎక్కువ ఉంటుందన్నారు. నవోదయ విద్యాలయ సమితి, కేంద్రీయ విద్యాలయ సంఘటన్ సహకారంతో ఆదిత్య మెహతా ఫౌండేషన్ (ఏఎంఎఫ్‌‌‌‌‌‌‌‌) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘‘టాలెంట్ హంట్--– 2023”ను శుక్రవారం గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. దివ్యాంగులు తీవ్ర వివక్షకు గురవుతున్నారని, దాన్ని రూపుమాపాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. టాలెంట్‌‌‌‌‌‌‌‌ హంట్‌‌‌‌‌‌‌‌లో భాగంగా అండర్‌‌‌‌‌‌‌‌–17 పారా అథ్లెట్లకు ట్రైనింగ్ ఇచ్చి జాతీయ, అంతర్జాతీయ పోటీలకు సిద్ధం చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. టాలెంట్ ఉన్న పారా అథ్లెట్లను గుర్తించేందుకు ఆదిత్య మెహతా ఫౌండేషన్ చేపట్టిన క్యాంప్ అభినందనీయమన్నారు. దివ్యాంగుల ఆత్మవిశ్వాసం మరింత పెంపొందించేలా మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. 

పారా అథ్లెట్లతో దేశానికి ఉజ్వల భవిష్యత్తు

పారా ఒలంపిక్స్​లో ఇండియన్​ అథ్లెట్లు19 మెడల్స్​తో రికార్డు సృష్టించారని తమిళిసై గుర్తు చేశారు. ఇప్పటి వరకు ఇదే అత్యుత్తమ ప్రద ర్శన అని కొనియాడారు. ఇండియాకు ఉజ్వల భవిష్యత్తు ఉందని నిరూపించారన్నారు. షూటింగ్, సైక్లింగ్, షార్ట్​పుట్ ప్రాక్టీస్​ను గవర్నర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రెన్యూర్‌‌‌‌‌‌‌‌, మాజీ మిస్ ఇండియా శిల్పా రెడ్డి, నవోదయ విద్యాలయ సమితి కమిషనర్ వినాయక్‌‌‌‌‌‌‌‌ గార్గ్‌‌‌‌‌‌‌‌, కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌‌‌‌‌‌‌‌ డిప్యూటీ కమిషనర్ డాక్టర్‌‌‌‌‌‌‌‌ మంజునాథ్‌‌‌‌‌‌‌‌, ఏఎంఎఫ్​ వ్యవస్థాపకుడు ఆదిత్య మెహతా పాల్గొన్నారు.

100వ మన్​కి బాత్​పై గవర్నర్ రివ్యూ

ప్రధాని మోడీ నిర్వహించనున్న మన్ కీ బాత్​పై శుక్రవారం రాజ్​భవన్​లో గవర్నర్ తమిళిసై రివ్యూ చేపట్టారు. ఈ నెల 30న జరగనున్న మన్ కి బాత్ 100వ ఎపిసోడ్​ను రాజ్​భవన్​లో ప్రత్యక్ష ప్రసారం స్క్రీనింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన 100 మందిని తమిళిసై రాజ్​భవన్​కు ఇన్వైట్ చేయనున్నారు. కార్యక్రమానికి సంబంధించి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఆల్ ఇండియా రేడి యో అధికారులతో గవర్నర్ చర్చించారు.