ఆగస్టు 15, 2023 సందర్భంగా తెలంగాణ రాష్ర్ట ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలిపారు. అనాడు స్వాతంత్ర్యం కోసం నిస్వార్థంగా పోరాడిన మహనీయుల ధైర్యాన్ని, వారి త్యాగాలను, పోరాట పఠిమను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. 2023, ఆగస్టు 15కి ప్రత్యేకత ఉందని చెప్పారు. ఈ ఏడాది అమృత్ కాల్ మొదటి సంవత్సరాన్ని సూచిస్తుందన్నారు.
ఈ మహత్తర ఉద్యమంలో మెరుగైన భారతదేశాన్ని నిర్మించడానికి దేశ ప్రజలందరం కలిసి కృషి చేద్దామంటూ గవర్నర్ పిలుపునిచ్చారు. అందరికీ నాణ్యమైన విద్య అందించాలని, మహిళా సాధికారతకు, పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం కలిసి కృషి చేయాలని కోరారు. ఇవన్నీ చేసినప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని చెప్పారు.