బాలిక గ్యాంగ్ రేప్ ఘటనపై సీఎస్, డీజీపీకి గవర్నర్ తమిళిసై ఆదేశం

 బాలిక గ్యాంగ్ రేప్ ఘటనపై సీఎస్, డీజీపీకి గవర్నర్ తమిళిసై ఆదేశం

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ లోని మీర్ పేట పరిధిలో 16 ఏండ్ల బాలికపై గ్యాంగ్ రేప్ ఘటనపై గవర్నర్ తమిళిసై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. 48 గంటల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎస్ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్, రాచకొండ సీపీని గవర్నర్ ఆదేశించారు. బాలిక కుటుంబాన్ని ఆదుకోవాలని రంగారెడ్డి జిల్లా రెడ్ క్రాస్ యూనిట్ ను గవర్నర్ కోరారు.

గవర్నర్‌‌‌‌కు డెంటల్ పరీక్షలు

గవర్నర్ తమిళిసై పంటి నొప్పితో బాధపడుతున్నారు. సోమవారం సాయంత్రం పుదుచ్చేరి నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆమె.. రాత్రి ఫిల్మ్ నగర్‌‌‌‌లోని సాయిశ్రీ డెంటల్ క్లినిక్‌‌కు వెళ్లి ట్రీట్‌‌మెంట్ తీసుకున్నారు. మంగళవారం ఉదయం కూడా మరోసారి క్లినిక్‌‌కు వెళ్లి చికిత్స తీసుకోనున్నట్లు రాజ్‌‌భవన్ అధికారులు తెలిపారు.