యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్

యాదగిరిగుట్టలో శ్రీలక్ష్మీనరసింహస్వామిని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఇవాళ దర్శించుకున్నారు. గవర్నర్ కు జిల్లా కలెక్టర్ పమేలా సత్ పతి స్వాగతం పలికారు. పోలీస్ గౌరవ వందనం అనంతరం ఆమె స్వామివారి దర్శనానికి బయలుదేరారు. ఆలయానికి వచ్చిన గవర్నర్ కు ఇంచార్జ్ ఈవో, ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆమె స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రజలందరూ బాగుండాలని స్వామి వారిని కోరుకున్నానని ఆమె తెలిపారు. కాగా ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ‌ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌‌ తమిళిసై ప్రసంగించనున్నారు.