పీవీ విగ్రహాన్ని ఆవిష్కరించిన తమిళిసై, కేసీఆర్

పీవీ విగ్రహాన్ని ఆవిష్కరించిన తమిళిసై, కేసీఆర్

మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. శతజయంతి ఉత్సవాల సందర్భంగా నెక్లెస్ రోడ్డులో(పీవీమార్గ్) ఏర్పాటు చేసిన 26 అడుగుల పీవీ విగ్రహాన్ని గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఆ తర్వాత పీవీ విగ్రహానికి నివాళులర్పించారు. అక్కడి నుంచి పీవీ ఘాట్ కు చేరుకున్న గవర్నర్ తమిళి సై, సీఎం కేసీఆర్.... నివాళులర్పించారు. ఆ తర్వాత పీవీపై రాసిన పుస్తకాలను ఆవిష్కరించారు గవర్నర్ తమిళి సై, సీఎం కేసీఆర్.