బ్లాక్ క్యాట్ కార్ ర్యాలీ ప్రారంభించిన గవర్నర్ తమిళిసై

బ్లాక్ క్యాట్ కార్ ర్యాలీ ప్రారంభించిన గవర్నర్ తమిళిసై

పీపుల్ ప్లాజాలో సుదర్శన్ భారత్ పరిక్రమ (బ్లాక్ క్యాట్ కార్ ర్యాలీ)ని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్ఎస్జీ ధైర్యానికి ప్రతీక అని తమిళిసై కొనియాడారు. ‘ఎన్ఎస్జీని చూసి స్ఫూర్తిని పొందాలి. ఇలాంటి కార్ ర్యాలీని నిర్వహిస్తునందుకు ఎన్ఎస్జీకి అభినందనలు. ముఖ్యమైన వార్ మెమోరియల్ ప్రాంతాలను ఎన్ఎస్జీ కమాండోస్ విజిట్ చేస్తుండటం ఆనందంగా ఉంది. ఈ ర్యాలీ ఎంతో మందికి ఇన్స్పరేషన్‎గా నిలుస్తుంది. ఎన్నో గొప్ప ఆపరేషన్‎లను ఎన్ఎస్జీ విజయవంతంగా నిర్వహించింది. ఎన్ఎస్జీ వంటి వాటి వల్ల దేశంలో ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు’ అని గవర్నర్ తమిళిసై అన్నారు.

ఆజాది కా అమృత్ మహోస్తవ్‎లో భాగంగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండోస్ ఈ బ్లాక్ క్యాట్ ర్యాలీని నిర్వహిస్తున్నారు. 75 ఏళ్ల స్వతంత్ర భారత సంబరాల్లో భాగంగా అక్టోబర్ 2న ఢిల్లీలోని ఎర్ర కోట నుంచి బ్లాక్ క్యాట్ కార్ ర్యాలీ బయలుదేరింది. డిల్లీ నుంచి ఆగ్రా, లక్నో, వారణాసి, గయ, జంషడ్ పూర్, కోల్‎కత, విశాఖపట్నానికి ఈ ర్యాలీ చేరుకుంది. అనంతరం విశాఖపట్నం నుంచి హైదరాబాద్ ర్యాలీ చేరుకుంది. హైదరాబాద్ నుంచి ఒంగోలు మీదుగా చెన్నైకి వెళ్లనుంది. దేశ వ్యాప్తంగా 12 రాష్ట్రాల్లోని 18 నగరాల మీదుగా మొత్తం 7500 కిలోమీటర్లు 47 మంది NSG కమాండోస్ పర్యటించనున్నారు. ఈ బ్లాక్ క్యాట్ కార్ ర్యాలీ అక్టోబర్ 30 వరకు కొనసాగనుంది.