సుష్మస్వరాజ్, జైట్లీకి పద్మవిభూషణ్..సింధూకు పద్మభూషణ్

సుష్మస్వరాజ్, జైట్లీకి పద్మవిభూషణ్..సింధూకు పద్మభూషణ్

రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్రం పద్మ అవార్డులను ప్రకటించింది. పలు రంగాల్లో సేవలందించిన వారికి పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డుల లిస్ట్ ను రిలీజ్ చేసింది. మొత్తం 141 మందికి ఈ అవార్డులను ప్రకటించింది.ఇందులో ఏడుగురికి పద్మ విభూషణ్, 16 మందికి పద్మభూషన్, 118 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి.రిపబ్లిక్ డే రోజున రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా వీరు ఈ అవార్డులను అందుకోనున్నారు

అరుణ్ జైట్లీ, సుష్మస్వరాజ్, జార్జ్ ఫెర్నాండేజ్, మేరీ కోమ్, చెన్నులాల్ మిశ్రా, అనిరుధ్ జుగ్ నౌద్ మిశ్రా, విశ్వేశ్వ తీర్థ స్వామీజీలకు పద్మ విభూషణ్ దక్కింది.

మనోహర్ పారికర్, ఆనంద్ మహీంద్ర,  తెలుగ తేజం పీవీ సింధు  వీరితో పాటు మరో 13 మందికి పద్మభూషణ్ అవార్డ్ వరించింది. సినీ నటి కంగనా రనౌత్, సింగర్ అద్నాన్ సమీ, నిర్మాత కరణ్ జోహర్, ఏక్తాకపూర్  వీరితో పాటు ఏపీకి చెందిన  దళవాయి చలపతి రావు, యడ్ల గోపాల్ రావు, తెలంగాణ నుంచి చింతల వెంకట్ రెడ్డి, విజయసారథి, శ్రీభాష్యమ్ లకు పద్మశ్రీ దక్కింది.

2020 పద్మ అవార్డుల లిస్ట్ కోసం క్లిక్ చేయండి