ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వడానికే పీపీఎఫ్‌‌‌‌‌‌‌‌పై వడ్డీ మార్చలే

ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వడానికే పీపీఎఫ్‌‌‌‌‌‌‌‌పై వడ్డీ మార్చలే
న్యూఢిల్లీ: ట్యాక్స్ ప్రయోజనాలను అందించేందుకే మార్కెట్‌‌‌‌‌‌‌‌లో వడ్డీ రేట్లు పెరిగినా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్‌‌‌‌‌‌‌‌) రేట్లను ప్రభుత్వం పెంచలేదని ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. ప్రస్తుతం పీపీఎఫ్‌‌‌‌‌‌‌‌పై ఏడాదికి 7.1 శాతం వడ్డీ వస్తోంది. బాండ్ ఈల్డ్‌‌‌‌‌‌‌‌లు పెరగడం వలన  ఈ వడ్డీ 7.51 శాతంగా ఉండాలి.  స్మాల్ సేవింగ్స్ స్కీమ్‌‌‌‌‌‌‌‌లలో పీపీఎఫ్‌‌‌‌‌‌‌‌ బాగా పాపులర్ అయ్యింది. 

పీపీఎఫ్ వడ్డీపై ట్యాక్స్ వేయడం లేదు. అలానే ఇన్‌‌‌‌‌‌‌‌కమ్ ట్యాక్స్ చట్టం సెక్షన్ 80 సీ కింద రూ.1.5 లక్షల ఆదాయం వరకు ట్యాక్స్ డిడక్షన్‌‌‌‌‌‌‌‌ పొందొచ్చు. పీపీఎఫ్‌‌‌‌‌‌‌‌పై ఇస్తున్న వడ్డీ గత మూడున్నరేళ్లుగా మారకపోవడం గమనించాలి. మార్కెట్‌‌‌‌‌‌‌‌లో ఇతర స్మాల్ సేవింగ్స్ స్కీమ్‌‌‌‌‌‌‌‌ల వడ్డీ రేట్లను ప్రభుత్వం పెంచినప్పటికీ పీపీఎఫ్ రేట్లను మాత్రం మార్చలేదు. స్మాల్‌‌‌‌‌‌‌‌ సేవింగ్స్‌‌‌‌‌‌‌‌ వడ్డీ రేట్లు ప్రభుత్వ బాండ్ల ఈల్డ్‌‌‌‌‌‌‌‌లకు లింక్‌‌‌‌‌‌‌‌ అయి ఉంటాయి. బాండ్ ఈల్డ్‌‌‌‌‌‌‌‌లు పెరిగితే  ఈ స్కీమ్‌‌‌‌‌‌‌‌ల రేట్లు కూడా పెరుగుతాయి. 

ఈ ఫార్ములా ప్రకారం పీపీఎఫ్‌‌‌‌‌‌‌‌పై ఇవ్వాల్సిన వడ్డీ రేటు 7.51 శాతంగా ఉండాలని ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్టులు చెబుతున్నారు. వరుసగా తొమ్మిది క్వార్టర్ల పాటు స్మాల్ సేవింగ్‌‌‌‌‌‌‌‌ స్కీమ్‌‌‌‌‌‌‌‌ల వడ్డీ రేట్లను మార్చని ప్రభుత్వం,  కరోనా తర్వాత నుంచి వరుసగా ఐదు క్వార్టర్లలో పెంచింది. ఇలా రేట్లను మార్చడం వలన  మిగిలిన స్మాల్ సేవింగ్స్‌‌‌‌‌‌‌‌ స్కీమ్‌‌‌‌‌‌‌‌లు ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ వేసిన లెక్కల ప్రకారమే వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి.

 కాగా, కిందటేడాది మే నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ మధ్య రెపో రేటు 250‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బేసిస్ పాయింట్లు పెరిగింది. ఇదే టైమ్‌‌‌‌‌‌‌‌లో సీనియర్ సిటిజెన్‌‌‌‌‌‌‌‌ స్కీమ్స్‌‌‌‌‌‌‌‌ ఇస్తున్న వడ్డీ 80 బేసిస్ పాయింట్లు, నేషనల్ సేవింగ్స్‌‌‌‌‌‌‌‌ సర్టిఫికేట్‌‌‌‌‌‌‌‌ వడ్డీ 90 బేసిస్‌‌‌‌‌‌‌‌ పాయింట్లు, సుకన్య సమృద్ధి యోజన వడ్డీ 40 బేసిస్ పాయింట్లు పెరిగింది. ఇదే టైమ్‌‌‌‌‌‌‌‌లో పీపీఎఫ్‌‌‌‌‌‌‌‌ వడ్డీ మాత్రం ప్రభుత్వం పెంచలేదు. ఈ టైమ్‌‌‌‌‌‌‌‌లోనే బ్యాంకులు ఇచ్చే డిపాజిట్లపై వడ్డీ సగటును 150 బేసిస్ పాయింట్లు పెరిగింది. వంద బేసిస్ పాయింట్లు అంటే ఒక శాతం అని అర్థం.