
టీచర్ల నియామకాలు వెంటనే చేపట్టాలంటూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖకు ఉత్తర్వులు జారీచేసింది. రిక్రూట్ మెంట్ ప్రాసెస్ త్వరగా కంప్లీట్ చేసేలా…. ఎంపికైన అభ్యర్థుల నియామకానికి సంబంధించిన చర్యలు తీసుకునేలా…. ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ప్రతి జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.
ఈనెలాఖరులోగా ఉత్తర్వులు జారీచేసేందుకు విద్యాశాఖలో కసరత్తు ప్రారంభమైంది. స్కూల్ అసిస్టెంట్ , ఎస్జీటీ, ఇతర ఉద్యోగాలకు 7వేల 414 మంది అభ్యర్థులు ఇప్పటికే ఎంపికయ్యారు. కోర్టు వివాదాలతో మరో 1,378 పోస్టుల భర్తీ ఇంకా పూర్తికాలేదు. టీఎస్పీఎస్సీలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తైనప్పటికీ… నియామకాలు ఉత్తర్వులు రావడంలో ఆలస్యం జరుగుతోంది. విద్యాశాఖ తీరుపై టీఆర్టీ సెలెక్టెడ్ అభ్యర్థులు ఇప్పటికే పలుమార్లు నిరసన తెలిపారు. దీంతో.. ఎంపికైన అభ్యర్థుల నియామకాలను పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖను ఆదేశించింది.