జీఎస్టీ కలెక్షన్ టార్గెట్ పెంచిన్రు

జీఎస్టీ కలెక్షన్ టార్గెట్ పెంచిన్రు

న్యూఢిల్లీ : జీఎస్టీ కలెక్షన్ టార్గెట్‌‌ను ట్యాక్స్ డిపార్ట్‌‌మెంట్ పెంచింది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో రూ.1.15 లక్షల కోట్ల చొప్పున, మార్చి నెలలో రూ.1.25 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు చేపట్టాలని ట్యాక్స్ డిపార్ట్‌‌మెంట్ నిర్దేశించుకుంది.  మోసపూరిత ఇన్‌‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లయిమ్స్‌‌ను చెక్‌‌ చేయడం ద్వారా ఈ వసూళ్లను పెంచనుంది. గత నెలలో జీఎస్టీ ట్యాక్స్ కలెక్షన్‌‌ నెలకు రూ.1.1 లక్షల కోట్లు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. జీఎస్టీ వసూళ్ల టార్గెట్‌‌ను పెంచడం రెండు నెలల కాలంలో ఇది రెండోసారి. కార్పొరేట్ ట్యాక్స్ రిలీఫ్ రూ.1.45 లక్షల కోట్లు ఇచ్చినా.. ప్రత్యక్ష పన్ను టార్గెట్‌‌  రూ.13.35 లక్షల కోట్లుగానే ఉంచింది. రెవెన్యూ సెక్రటరీ అజయ్ భూషణ్ పాండే నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది.