ఆహార వస్తువుల ఉత్పత్తి, రేట్లు గమనిస్తున్నాం : కైలాష్​ చౌదరి

ఆహార వస్తువుల ఉత్పత్తి, రేట్లు గమనిస్తున్నాం :  కైలాష్​ చౌదరి

న్యూఢిల్లీ: నిత్యావసర ఆహార పదార్థాల రేట్లను నిరంతరం గమనిస్తున్నామని, అలాగే సప్లయ్– డిమాండ్​లనూ మానిటర్​ చేస్తున్నామని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్​ చౌదరి వెల్లడించారు. రైతులు, కన్జూమర్లు....ఇద్దరి ప్రయోజనాల మధ్య బాలెన్స్​ కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఎసెన్షియల్​  ఫుడ్​ ఐటమ్స్​ రేట్లను, వాటి లభ్యతను ఎప్పటికప్పుడు గమనించేందుకు ఒక ప్యానెల్​ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అన్నారు. ఫలితంగా,  అవసరమైనప్పుడల్లా తగిన చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. దేశీయంగా ఆయా ఫుడ్​ ఐటమ్స్​ అందుబాటులో ఉండేలా చూడటంతోపాటు, రేట్లను పెరగకుండా చూస్తోందని అన్నారు. ఫుడ్​ ఇన్​ఫ్లేషన్​, నాన్​–బాస్మతి రైస్​ ఎగుమతిపై నిషేధం గురించి అడిగిన ప్రశ్నలకు మంత్రి పై విధంగా బదులిచ్చారు. ఇండియా పోస్ట్​తో కలిసి ఐటీసీ మంగళవారం తీసుకొచ్చిన తృణ ధాన్యాల పోస్టల్​ స్టాంప్​ విడుదల కార్యక్రమంలో కైలాష్​ చౌదరి పాల్గొన్నారు. 

ఫుడ్​ ఐటమ్స్ ​సప్లయ్​ ప్రాబ్లమ్​ లేదు...

డిమాండ్​–సప్లయ్​తో పాటు, రిటెయిల్​ రేట్లను పరిశీలించే ఎగుమతి డ్యూటీ , ఇతర ఆంక్షలను ప్రభుత్వం విధిస్తుందని మంత్రి వెల్లడించారు. దేశంలో ఆహార వస్తువుల సప్లయ్​ విషయంలో ఎలాంటి సమస్యలూ లేవని చెప్పారు. కన్జూమర్లు, రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే సమతౌల్యం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని కైలాష్​ చౌదరి పేర్కొన్నారు. నేషనల్​ స్టాటిస్టికల్​ ఆఫీస్​ (ఎన్​ఎస్​ఓ) డేటా ప్రకారం జూన్​ నెలలో ఫుడ్ ​బాస్కెట్​ ఇన్​ఫ్లేషన్​ 4.49 శాతం ఎగసింది. ఇది అంతకు ముందు నెల అంటే మే 2023 లో 2.96 శాతం మాత్రమే. కన్జూమర్​ ప్రైస్​ ఇండెక్స్​(సీపీఐ)లో సగం వాటా ఫుడ్​ బాస్కెట్​దే ఉంటుంది. మసాలా దినుసులు (స్పైసెస్​) రేట్లు ఏడాది ప్రాతిపదికన 19.19 శాతం, తృణ ధాన్యాలు–సంబంధిత ఉత్పత్తుల రేట్లు 12.71 శాతం, పప్పులు–సంబంధిత ఉత్పత్తుల రేట్లు 10.53 శాతం, గుడ్ల రేట్లు 7 శాతం పెరిగినట్లు ఎన్​ఎస్​ఓ డేటా వివరిస్తోంది. అంతకు ముందు ఏడాది జూన్​తో పోలిస్తే ఈ ఏడాది జూన్​లో పండ్ల రేట్లు కూడా కొద్దిగా పెరిగినట్లు పేర్కొంటోంది.  

ALSO READ :సెలబ్రిటీల్లో కానరాని ఆదర్శాలు

తృణ ధాన్యాలతో ఆరోగ్యానికి మేలు...

తృణ ధాన్యాల ఉత్పత్తి,  వినియోగం దేశంలో  భారీగా పెరగాలని ఈ కార్యక్రమంలో మంత్రి కైలాష్​ చౌదరి సూచించారు. గ్లోబల్​గా చూసినా తృణ ధాన్యాలకు డిమాండ్​ ఎక్కువవుతోందని చెప్పారు. ఇండియా పెద్ద ఉత్పత్తిదారు కావడం వల్ల గ్లోబల్​ డిమాండ్​ పెరగడం మన దేశానికి కలిసి వస్తుందన్నారు. తృణ ధాన్యాల వినియోగం దేశంలోనూ, విదేశాలలోనూ పెరిగితే మన రైతులకు ఎంతో మేలు కలుగుతుందని, చిన్న రైతులకు చాలా ప్రయోజనకరమని అన్నారు.