నిధులు రాలేదని స్కూల్ గదులకు తాళం..

నిధులు రాలేదని స్కూల్ గదులకు తాళం..

ఓ గ్రామంలో సర్సంచ్, ఎంపీటీసీ మధ్య తలెత్తిన రాజకీయ వివాదం పాఠశాల విద్యార్థులకు శాపంగా మారింది. వీరి పంచాయతీతో పిల్లలు చెట్టు కింద పాఠాలు వినాల్సిన దుస్థితి వచ్చింది.  వివరాల్లోకి వెళ్లితే.. జగిత్యాల జిల్లాలోని పొరండ్ల ప్రాథమిక పాఠశాలలో ఎంపీటీసీ నిధులతో రెండు తరగతి గదులను నిర్మించారు. ఈ గదులకు ఎంపీటీసీ సౌజన్య భర్త తిరుపతి తాళం వేశారు. ఈ పనులకు ఖర్చు చేసిన నిధులు మంజూరు కాకుండా స్థానిక సర్పంచ్ సంధ్యారాణి తీర్మానం ఇవ్వడం లేదని తిరుపతి ఆరోపించారు.

గతంలో స్కూల్ గదులు రెండు శిథిలావస్థలోకి చేరడంతో పిల్లలకు ఇబ్బంది రాకుండా ఉండేందుకు రూ.3.2 లక్షల ఎంపీటీసీ నిధులతో గదులు కట్టించామని ఆయన వెల్లడించారు. అయితే ఈ నిధులు మంజూరు కావాలంటే పంచాయతీ తీర్మానం అవసరం కాగా.. సర్పంచ్ సంధ్యారాణి రాజకీయ కక్షతో అవి రానియకుండా వేధిస్తున్నారని తిరుపతి ఆరోపించారు. సర్పంచ్, ఎంపీటీసీ మధ్య వివాదంతో విద్యార్థులు అవస్తలు పడుతున్నారు. వీరి నిధుల పంచాయితీ వల్ల విద్యార్థులకు చెట్టు కింద పాఠాలు చెపుతున్నారు టీచర్లు.