మండలానికో సర్కారు ఓక్రిడ్జ్ బడి పెట్టాలి: ఆకునూరి మురళి

మండలానికో సర్కారు ఓక్రిడ్జ్ బడి పెట్టాలి: ఆకునూరి మురళి
  • 200 బెడ్లతో సూపర్ ​స్పెషాలిటీ హాస్పిటల్​
  • కాంగ్రెస్​ మేనిఫెస్టో కమిటీకి ఆకునూరి మురళి ప్రతిపాదన
  • వ్యవసాయ కమిషన్, అవినీతి నిర్మూలన కమిషన్​ ఏర్పాటుకు విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు :  మేనిఫెస్టోలో  చేర్చాల్సిన అంశా లపై కాంగ్రెస్​ పార్టీ మేనిఫెస్టో కమిటీ బుధవారం సమా వేశమైంది. గాంధీభవన్​లో  కమిటీ చైర్మన్​ శ్రీధర్​ బా బు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితుడు దామోదర రాజనర్సింహ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో సోషల్​ డెమొక్రటిక్​ ఫోరం కన్వీనర్​, రిటైర్డ్​ ఐఏఎస్​ అధికారి ఆకునూరి మురళి కాంగ్రెస్​ మేనిఫెస్టోలో పెట్టాల్సిన అంశాలపై పలు ప్రతిపాదనలను సూచించారు. 

విద్య, వైద్యం, అవినీతి నిర్మూలన, వ్యవసాయం వంటి విషయాలపై ఆయన సూచనలను చేశారు. దానికి సంబంధించిన నివేదికలను ఆయన​కాంగ్రెస్​ మేనిఫెస్టో కమిటీకి అందజేశారు. ప్రతి మండలానికీ సీఎం మనవడు చదువుతున్న ఓక్రిడ్జ్​ లాంటి స్కూల్​ను నిర్మించాలన్న ప్రతిపాదనను కాంగ్రెస్​ నేతలకు మురళి వివరించారు. మండలానికో 200 బెడ్ల సూపర్​ స్పెషాలిటీ హాస్పిటల్​ పెట్టాల్సిందిగా సూచించారు. 40 లక్షల మందికి ఉద్యోగాలిచ్చేలా ప్రణాళికలను రూపొందించాలన్నారు.  

ALSO READ: బీజేపీ టికెట్​ కోసం పోటాపోటీ.. బరిలో దిగేందుకు లీడర్ల ఆసక్తి

రైతుల మేలు కోసం వ్యవసాయ కమిషన్​ను ఏర్పాటు చేయాలని సూచించారు. వాటితో పాటు పూర్తిగా అవినీతి నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా, కరీంనగర్​లో ఎయిర్​పోర్టును నిర్మిస్తామన్న హామీనీ మేనిఫెస్టోలో చేర్చాల్సిందిగా పీసీసీ అధికార ప్రతినిధి కొణగాల మహేశ్​ కోరారు.