ఢిల్లీ సరిహద్దుల్లో ఇంటర్నెట్​ సేవలపై నిషేధం

ఢిల్లీ సరిహద్దుల్లో ఇంటర్నెట్​ సేవలపై నిషేధం

రైతుల ఆందోళనల కారణంగా ఢిల్లీ సరిహద్దుల్లో రెండు రోజుల పాటు ఇంటర్నెట్ సేవలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. సింఘూ, ఘాజీపూర్, టిక్రి బోర్డర్ల దగ్గర ఆదివారం(జనవరి–31) రాత్రి 11 గంటల వరకు నిషేధం వర్తిస్తుందని తెలిపింది.  దీనికి సంబందించి శనివారం మధ్యాహ్నం కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా సరిహద్దులతో పాటు వాటికి ఆనుకుని ఉండే NCT పరిసర ప్రాంతాల్లోనూ నిషేధం అమల్లో ఉంటుందని తెలిపింది. ఘాజీపూర్ సరిహద్దుల్లో ఫోన్ సర్వీసులనూ తాత్కాలికంగా నిలిపేసింది.

ఇప్పటికే హర్యానా ప్రభుత్వం 17 జిల్లాల్లో జనవరి 31 సాయంత్రం 5 గంటల వరకు ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించింది. రైతు సంఘం నేతలు జనవరి 30న మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా సద్భావన దినాన్ని నిర్వహించారు.