
- చిన్న బిజినెస్‌లు ఆన్‌లైన్‌లో విస్తరించేందుకు త్వరలో ప్రభుత్వ పాలసీ
న్యూఢిల్లీ: చిన్న బిజినెస్‌లను మరింతగా సపోర్ట్ చేసేందుకు బిజినెస్ టు బిజినెస్ ప్లాట్‌ఫామ్ ఎంఎస్‌ఎంఈ గ్లోబల్ మార్ట్‌ను ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్‌డీసీ) తో లింక్ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇలా చేయడం ద్వారా మైక్రో, స్మాల్, మీడియం (ఎంఎస్‌ఎం) బిజినెస్‌లు మరింత మంది కస్టమర్లకు చేరువుతాయని కేంద్ర ఎంఎస్‌ఎంఈ మినిస్టర్ నారాయణ్ రాణే అన్నారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (ఐఐపీఏ) ఎంఎస్‌ఎంఈ పాలసీని తయారు చేసిందని, ఫైనలైజ్ కూడా చేశామని అన్నారు. ఇంకో మూడు నాలుగు నెలల్లో పబ్లిష్ చేస్తామని వెల్లడించారు.
జీడీపీలో ఎంఎస్‌ఎంఈల కంట్రిబ్యూషన్‌ను ప్రస్తుతం ఉన్న 30 శాతం నుంచి 40 శాతానికి పెంచాలని ప్రభుత్వం చూస్తోందని వివరించారు. ఎకానమీని నడిపే హై గ్రోత్ ఇండస్ట్రీలకు పెద్ద పీట వేయాలని చూస్తున్నామని రాణే పేర్కొన్నారు. ‘ఎంఎస్‌ఎంఈలు ఆన్‌లైన్‌లో కూడా విస్తరించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి కావడంతో ఎంఎస్‌ఎంఈ గ్లోబల్ మార్ట్ ద్వారా ఈ–కామర్స్ విధానాలను అనుసరించే చిన్న బిజినెస్‌లకు ప్రభుత్వం 75 శాతం రాయితీ ఇస్తోంది.
అంటే చిన్న బిజినెస్‌లు చేసిన ఈ–కామర్స్ ఖర్చులో 75 శాతం లేదా రూ.25 వేలను (ఏడాదిలో ఏది తక్కువైతే అది) రాయితీగా ఇస్తోంది. గ్లోబల్‌గా బిజినెస్ నుంచి బిజినెస్‌లకు ఈ–మార్కెటింగ్ పోర్టల్‌గా ఎంఎస్‌ఎంఈ గ్లోబల్ మార్ట్ పనిచేస్తోంది. చిన్న బిజినెస్‌లు ఆన్‌లైన్‌లో మరింతగా విస్తరించేందుకు ఈ ప్లాట్‌ఫామ్‌ను ఓఎన్‌డీసీతో లింక్ చేయాలని చూస్తున్నాం’ అని నారాయణ్ రాణే పేర్కొన్నారు. ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో బిజినెస్‌లు జాయిన్ అయ్యేలా ప్రోత్సహిస్తున్నామని అన్నారు. అంతేకాకుండా కొత్త మార్కెట్లను యాక్సెస్ చేసుకోవడానికి వీలుగా ప్రొక్యూర్‌మెంట్ అండ్ మార్కెటింగ్ సపోర్ట్ స్కీమ్‌ను కూడా ప్రభుత్వం తెచ్చే పనిలో ఉందన్నారు.