కేంద్రం స్పందించడం లేదు.. ఢిల్లీకి వెళ్లి తీరుతం: రైతు సంఘం నేతల అల్టీమేటం

కేంద్రం స్పందించడం లేదు.. ఢిల్లీకి వెళ్లి తీరుతం: రైతు సంఘం నేతల అల్టీమేటం

రైతుల డిమాండ్లపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జాప్యం చేసేందుకు వ్యూహాలకు పాల్పడుతోందని రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లేవాల్ తెలిపారు. పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్ పీ) పై చట్టం తేవడంపై ప్రభుత్వం ప్రటకన చేయడం లేదని విమర్శించారు.  దేశ రాజధాని ఢిల్లీ వైపు పాదయాత్ర చేస్తున్న రైతులను భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో పంజాబ్, హర్యానా మధ్య రెండు సరిహద్దు పాయింట్ల వద్ద బుధవారం(ఫిబ్రవరి 21)  ఆందోళన  దిగారు. శాంతియుతంగానే రైతులు పాదయాత్ర చేస్తున్నామని తెలిపారు జగ్జీత్ సింగ్ . 

శాంతియుతంగానే ఢిల్లీకి వెళ్లాలన్నది మా ఉద్దేశం. ప్రభుత్వమే బారీకేడ్లను తొలగించిన ఢిల్లీ వైపు పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఢిల్లీలో నిరసన తెలిపేందుకు ఏర్పాట్లు చేయాలని కోరారు. 

వేలాదిగా రైతులు పాల్గొనాలని పిలుపు 

ఫిబ్రవరి 21 న ఉదయం 11 గంటలకు ఢిల్లీ వైపు పాదయాత్రను ప్రారంభిస్తామని దల్లేవాల్ తెలిపారు. పంజాబ్, హర్యానా మధ్య రెండు సరిహద్దు పాయింట్ల వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ ఢిల్లీ ఛలో మార్చ్ ను ఐదేళ్లపాటు ప్రభుత్వ సంస్థల ద్వారా ఎంఎస్ పీ తో కొనుగోలు చేయాలన్న కేంద్రం ప్రతిపాదనను తిరస్కరించిన తర్వాత రైతులు తమ ఢిల్లీ చలో మార్చ్ ను తిరిగి బుధవారం ప్రారంభింనున్నారు. 

ఫిబ్రవరి 13న ఢిల్లీకి పాదయాత్ర ప్రారంభించిన వేలాది మంది రైతులను హర్యానా సరిహద్దుల్లోనే అడ్డుకున్నారు. అక్కడ భద్రతా సిబ్బందితో ఘర్షణకు దిగారు. అప్పటి నుంచి రైతులు పంజాబ్, హర్యానా మధ్య శంభూ, ఖనౌరీ సరిహద్దు పాయింట్ల వద్ద క్యాంపులు ఏర్పాటు చేసుకుని నిరసన తెలిపారు. 

పంటలపై ఎంఎస్పీ చట్టబద్దత, వ్యవసాయ రుణాల మాఫీ సహా తమ డిమాండ్లను ఆమోదించాలని  రైతులు ఢిల్లీ చలో మార్చ్ ను నిర్వహిస్తున్నారు. ఈ మార్చ్ కు సంయుక్త కిసాన్ మోర్చా(నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా రైతు సంఘాల నేతృత్వం వహిస్తున్నాయి.