
న్యూఢిల్లీ: ఇండియా మ్యాప్‌ను తప్పుగా చూపడంపై సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ మీద కేంద్ర సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత సార్వభౌమాధికారం, సమగ్రతను అగౌరవించేలా మరోసారి ప్రయత్నిస్తే సహించబోమని వార్నింగ్ ఇచ్చింది. భారత ప్రజల మనోభావాలను గౌరవించాలని మైక్రో బ్లాగింగ్ సైట్‌కు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఐటీ సెక్రటరీ అజయ్ సాహ్నే సూచించారు. ఇండియా సార్వభౌమాధికారానికి భంగం కలిగేలా ట్విట్టర్ ప్రయత్నిస్తే సహించబోమని, ఇది చట్టవిరుద్ధమని సాహ్నే స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్ భూభాగం చైనాలో ఉన్నట్లుగా లైవ్ లొకేషన్ ట్యాగ్‌లో ట్విట్టర్ చూపించడంపై సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే. ట్విట్టర్‌పై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. తాజాగా ఈ అంశంపై స్పందించిన కేంద్రం.. ట్విట్టర్‌పై సీరియస్ అయ్యింది. మరోసారి భారత్‌ను అగౌరవపరిచేలా వ్యవహరించొద్దని స్పష్టం చేసింది.