- గోపా రాష్ట్ర అధ్యక్షుడు సాయన్న గౌడ్
నిర్మల్, వెలుగు: గౌడ కులస్తులు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని గోపా(గౌడ ప్రొఫెషనల్ అండ్ అఫీషియల్ అసోసియేషన్) రాష్ట్ర అధ్యక్షుడు బండి సాయన్న గౌడ్ పేర్కొన్నారు. నిర్మల్ జిల్లాలో సర్పంచ్లు, ఉప సర్పంచ్ లు, వార్డ్ మెంబర్లుగా గెలుపొందిన గౌడ కులస్తులను గోపా ఆధ్వర్యంలో పట్టణంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వివిధ పోటీ పరీక్షల్లో మెరిట్ సాధించి సీట్లు పొందిన విద్యార్థులను సైతం సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గౌడ కులస్తులు రాజకీయాల్లో రాణించాలన్నారు.
గౌడ కుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరింతప్రాధాన్యత నివ్వాలని కోరారు. కులవృత్తిని రక్షించేందుకు అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో గోపా రాష్ట్ర కమిటీ సభ్యుడు రామ్మోహన్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు రామాగౌడ్, ప్రధాన కార్యదర్శి మల్కా గౌడ్, రాష్ట్ర కమిటీ సభ్యుడు రాంనాథ్ గౌడ్, సంఘ బాధ్యులు పాల్గొన్నారు.
