- బ్రసెల్స్ బయలుదేరిన
- మినిస్టర్ పీయూష్ గోయల్
న్యూఢిల్లీ: ఇండియా, యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య వాణిజ్య ఒప్పందాన్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్చలను వేగవంతం చేసింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ సోమవారం బ్రస్సెల్స్ (బెల్జియం) కు వెళ్లనున్నారు. అక్కడ ఆయన ఈయూ ట్రేడ్ కమిషనర్ మారోస్ సెఫ్కోవిక్‌తో సమావేశమై, ఇండియా-– ఈయూ ఫ్రీ ట్రేడ్ ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై చర్చించనున్నారు.
ఈ ఏడాది డిసెంబర్ నాటికి చర్చలు ముగించాలని ఇరువర్గాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. మార్కెట్ యాక్సెస్, నాన్-టారిఫ్ అడ్డంకులు, రెగ్యులేటరీ సహకారం వంటి అంశాలు చర్చకు వస్తాయి. స్టీల్, ఆటోమొబైల్, ఇతర అడ్డంకులపై ఇంకా విభేదాలు ఉన్నాయి. ఎనిమిదేళ్ల విరామం తర్వాత 2022లో ఇండియా, ఈయూ మధ్య చర్చలు తిరిగి ప్రారంభమయ్యాయి. కాగా, 2024–25లో ఇండియా-–ఈయూ మధ్య బైలేటరల్ ట్రేడ్ 136.53 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇండియా మొత్తం ఎగుమతుల్లో 17శాతం యూరప్‌కి పోతోంది. ఆటోమొబైల్, వైద్య పరికరాలు, మాంసం, మద్యం వంటి ఉత్పత్తులపై ట్యాక్స్ తగ్గించాలని ఈయూ కోరుతోంది. ఒప్పందం జరిగితే, ఇండియా నుంచి యూరప్‌కి వస్త్రాలు, ఔషధాలు, స్టీల్, పెట్రోలియం, ఎలక్ట్రికల్ ఉత్పత్తుల ఎగుమతి మరింత ఈజీగా మారుతుంది. ఎఫ్‌టీఏలో 23 విభాగాలను కవర్ చేయనున్నారు.
