జీపీవో, సర్వేయర్ఎగ్జామ్ సెంటర్ల తనిఖీ

జీపీవో, సర్వేయర్ఎగ్జామ్ సెంటర్ల తనిఖీ

వికారాబాద్​, వెలుగు: జీపీవో, లైసెన్స్​డ్​సర్వేయర్ల నియామక పరీక్షలను ఆదివారం జిల్లా కేంద్రంలోని బాలుర హైస్కూల్​లో నిర్వహించారు. ఎగ్జామ్​సెంటర్​ను కలెక్టర్ ప్రతీక్​ జైన్ తనిఖీ చేశారు.  జీపీవో పరీక్షకు 83 మంది అభ్యర్థులకు గానూ  66 మంది, లైసెన్స్​డ్​సర్వేయర్​ఎగ్జామ్​కు 139 మంది గానూ 121 మంది హాజరైనట్లు తెలిపారు. అడిషనల్​కలెక్టర్ లింగ్యా నాయక్, ఆర్డీవో వాసుచంద్ర, డీటీడీవో కమలాకర్ రెడ్డి, మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్​రాజేశ్వరి, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ నెమత్ అలీ తదితరులున్నారు.  

శంషాబాద్:  పాలమాకులలోని పీఎంశ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ లో లైసెన్స్​డ్ ఆదివారం ల్యాండ్ సర్వేయర్​అర్హత పరీక్ష నిర్వహించగా అడిషనల్​కలెక్టర్​ప్రతిమా సింగ్ తనిఖీ చేశారు. మొత్తం 403  మంది అభ్యర్థులకు గానూ 329 మంది హాజరయ్యారని తెలిపారు. సర్వే అండ్ ల్యాండ్​రికార్డ్స్​ఆఫీసర్ శ్రీనివాస్, రాజేంద్రనగర్ ఆర్డీవో వెంకట్ రెడ్డి, తహసీల్దార్ అవిందర్ దత్ తదితరులున్నారు.

 బాలాపూర్ మండలం జిల్లెలగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జీపీవో ఎగ్జామ్​సెంటర్​ను డీఆర్వో సంగీత, ఏవో సునీల్ తనిఖీ చేశారు. మొత్తం 111 మంది అభ్యర్థులకు గానూ101 మంది హాజరైనట్లు తెలిపారు. తహసీల్దార్ ఇందిరాదేవి తదితరులు పాల్గొన్నారు.