గ్రేడ్ 2 పండిట్లను టెట్ నుంచి మినహాయించాలి

గ్రేడ్ 2 పండిట్లను టెట్ నుంచి మినహాయించాలి
  •      కోదండరాంకు ఆర్​యూపీపీ వినతి 

హైదరాబాద్, వెలుగు: గ్రేడ్ 2 లాంగ్వేజ్ పండిట్లను టెట్ నుంచి మినహాయించి, గ్రేడ్1 పోస్టులకు ప్రమోషన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ (ఆర్​యూపీపీ) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జగదీశ్, నర్సిములు కోరారు. ఆదివారం హైదరాబాద్​లో టీజేఎస్ చీఫ్, టీచర్ల సమస్యల పరిష్కార కమిటీ ప్రతినిధి కోదండరాం​ను ఆ సంఘం నేతలు కలిసి వినతిపత్రం అందించారు.

 గ్రేడ్2 లాంగ్వేజ్ పండిట్ పోస్టుల అప్ గ్రేడేషన్ పై హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ప్రమోషన్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. బడుల్లో అమలు చేస్తున్న ఉన్నతి, లక్ష్య కార్యక్రమాలను రద్దు చేయాలని కోరారు. ప్రైమరీ స్కూళ్లలోనూ తెలుగు, హిందీ సబ్జెక్టుల బోధనకు లాంగ్వేజీ పండిట్లను నియమించాలన్నారు.