ECIL హైదరాబాద్ లో గ్రాడ్యుయేట్ ఇంజనీర్, టెక్నీషియన్ అప్రెంటీస్ ఉద్యోగాలు

ECIL హైదరాబాద్ లో గ్రాడ్యుయేట్ ఇంజనీర్, టెక్నీషియన్ అప్రెంటీస్ ఉద్యోగాలు

ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) లో గ్రాడ్యయేట్ ఇంజనీరింగ్ అప్రెంటీస్(GEA), డిప్లమా /టెక్నీషియన్ అప్రెంటీస్(TA) కోసం అప్రెంటిస్ షిప్ శిక్షణ కోసం అర్హత గల ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అప్రెంటిస్ (GEA) కోసం -250 ఖాళీలు, డిప్లమా /టెక్నీషియన్ అప్రెంటీస్(TA) కోసం-113 ఖాళీలున్నాయి. మొత్తం కలిపి 363సీట్లు అందుబాటులో ఉన్నాయి. 
విద్యార్హత:  
గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అప్రెంటీస్ లకోసం AICTE అనుమతి పొందిన కాలేజీలు / గుర్తింపు పొందిన భారతీయ యూనివర్సిటీలనుంచి 1ఏప్రిల్ 2021 న లేదా తరవాత పైనే పేర్కొన్న ఇంజనీరింగ్ బ్రాంచ్ లలో నాలుగు సంవత్సరాల BE/B.Tech కోర్సులలో ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవాలి. డిప్లమా అప్రెంటిస్ కోసం  1ఏప్రిల్ 2021 న లేదా తరవాత పైనే పేర్కొన్న ఇంజనీరింగ్ బ్రాంచ్ లలో3 సంవత్సరాల డిప్లమా పాస్ అయి ఉండాలి. 

వయోపరిమితి: 31/12/2023 నాటికి 25 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయసు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు,ఓబీసీ-ఎన్సీలకు 3 సం., పీడబ్లూడీ  అభ్యర్థులకు 10 సంవత్సరాల సడలింపు ఉంటుంది. జీతం:  గ్రాడ్యయేట్ ఇంజనీరింగ్ అప్రెంటీస్(GEA) లకు రూ. 9వేలు,  డిప్లమా /టెక్నీషియన్ అప్రెంటీస్(TA) రూ. 8వేలు. అభ్యర్థి ఎంపిక : అర్హత పరీక్ష మెరిట్ మార్కుల ఆధారంగా ఉంటుంది. పోస్టింగ్ : ECIL హైదరాబాద్. 

దరఖాస్తుకు చివరి తేది : 31/12/2023. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు గడువులోగా లేదాఅంతకుముందు అధికారిక వెబ్ సైట్ ద్వారా అన్ లైన్ లో దరఖాస్తు  చేసుకోవాలి. అప్రెంటిస్ షిప్ కోసం NATS పోర్టల్ లో నమోదు తప్పనిసరి.