
యాదాద్రి జిల్లా బాహుపేటలో గ్రామపంచాయతీ బోరును అధికార పార్టీకి చెందిన వార్డు సభ్యుడికి సర్పంచ్ అమ్మాడంటూ ఆందోళనకి దిగారు గ్రామస్థులు. దీనిపై గ్రామ యువకులు కలెక్టర్ అనితా రామచంద్రన్, స్థానిక ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. సర్పంచ్ కుండె పద్మ భర్త కుండె నర్సయ్య … తానే గ్రామ సర్పంచ్ గా పెత్తనం చేలాయిస్తున్నట్లు గ్రామస్ధులు ఆరోపిస్తున్నారు.
గ్రామానికి వినియోగించాల్సిన బోరు బావిని TRS వార్డు సభ్యునికి అమ్ముకోవడంతో.. రెండేళ్లుగా వ్యవసాయనికి ఉపయోగిస్తున్నట్లు గ్రామ యువకులు చెబుతున్నారు. గ్రామస్తుల ఫిర్యాదుతో బాహుపేటలో అధికారులు విచారణ చేపట్టారు. వార్డు సభ్యురాలు వాడుకుంటున్న బోరు… గ్రామపంచాయతీకి చెందినదేనని తేల్చారు. మరోసారి రిపీట్ అవేతే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు ఎంపీవో చంద్రశేఖర్. ఇన్నాళ్ళు వాడుకున్నందుకు వార్డు మెంబర్ పై చర్యలు తీసుకోవాలంటున్నారు గ్రామస్థులు.