మల్హర్ / చిట్యాల/ మొగుళ్లపల్లి/ నెక్కొండ/ జూలూరుపాడు/ ఖమ్మం/ కూసుమంచి, వెలుగు : సమస్యల పరిష్కారమే గ్రామ సభల ప్రధాన లక్ష్యమని ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు అన్నారు. సోమవారం ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన గ్రామసభల్లో కలెక్టర్లు, ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొని మాట్లాడారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం రుద్రారంలో కలెక్టర్ రాహుల్‌శర్మ పాల్గొనగా, చిట్యాల మండలం అందుకుతండా, మొగుళ్లపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమాల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొని సమస్యలపై ఆరా తీశారు.
వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో నిర్వహించిన గ్రామసభలో కలెక్టర్ సత్యశారద పాల్గొని పంటమార్పిడిపై అవగాహన కల్పించారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ఈశ్వరమాధారంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ దివాకర పాల్గొని ఎస్ఐఆర్, ప్రత్యామ్నాయ పంటల సాగుపై వివరించారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం మాచినేనిపేటతండాలో అడిషనల్ కలెక్టర్ విద్యాచందన పాల్గొని ప్లాస్టిక్నిషేధం, స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించారు.
