యాదగిరిగుట్టలో ‘నీరాటోత్సవాలు’ షురూ

యాదగిరిగుట్టలో ‘నీరాటోత్సవాలు’ షురూ
  • ఈ నెల 14 వరకు ఐదు రోజుల పాటు ‘నీరాటోత్సవాలు’

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా.. శనివారం గోదాదేవి అమ్మవారికి ‘నీరాటోత్సవాలు’ ఘనంగా మొదలయ్యాయి. ఇందులో భాగంగా మొదటి రోజైన శనివారం ఉదయం ఆలయంలో నవకలశ తిరుమంజన స్నపనం చేపట్టారు.

అనంతరం ప్రత్యేక అలంకారంలో గోదాదేవిని ఆలయ మాడవీధుల్లో విహరింపజేశారు. తర్వాత తిరుప్పావై మండపంలో తిరువాధన ఆరగింపు, తీర్థప్రసాద గోష్టి నిర్వహించారు. నీరాటోత్సవాల్లో భాగంగా ఈ నెల 14న రాత్రి 7 గంటలకు 'గోదా కల్యాణం', 15న ఉదయం 11:45 గంటలకు ‘ఒడిబియ్యం’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.