ఇన్‌స్టాగ్రామ్ పరిచయంతో గంజాయి విక్రయం.. ఇద్దరు యువకుల అరెస్ట్

ఇన్‌స్టాగ్రామ్ పరిచయంతో గంజాయి విక్రయం.. ఇద్దరు యువకుల అరెస్ట్

నల్గొండ, వెలుగు: ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఏర్పడిన పరిచయంతో  ఒడిశా నుంచి గంజాయి కొనుగోలు చేసి నల్గొండ యువకులకు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు యువకులను ఈగల్ ఫోర్స్, నల్గొండ రూరల్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.1.15 లక్షల విలువైన 4.6 కిలోల గంజాయి, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నల్గొండకు చెందిన సయ్యద్ మాజిద్, మొహమ్మద్ సోహైల్ అలీలకు ‘పాబ్లో ఎస్కోబార్’  పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో గంజాయి సరఫరాదారుడు శివారెడ్డితో పరిచయం ఏర్పడింది

. గంజాయిని  చిన్న ప్యాకెట్లుగా మార్చి రూ.500కు విక్రయించేందుకు డీల్ ప్లాన్ చేస్తుండగా..  పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు శివారెడ్డి పరారీలో ఉన్నట్లు డీఎస్పీ శివరాం రెడ్డి తెలిపారు. మాదకద్రవ్యాలపై సమాచారం చెబితే వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.