మెదక్జిల్లాలో సంబురంగా బతుకమ్మ వేడుకలు

మెదక్జిల్లాలో  సంబురంగా బతుకమ్మ వేడుకలు

గజ్వేల్​, వర్గల్, కౌడిపల్లి, తూప్రాన్, కోహెడ, అమీన్ పూర్, వెలుగు : ఉమ్మడి మెదక్​జిల్లాలో పలుచోట్ల బుధవారం బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మహిళలు తీరొక్క పూలతో అందంగా బతుకమ్మలను పేర్చిన ప్రధాన కూడళ్లలో పెట్టి ఆడిపాడారు. అనంతరం ‘పోయిరా బతుకమ్మ.. మళ్లీ రావమ్మా’ అంటూ చెరువుల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో బుధవారం బతుకమ్మ సంబురాలు ఘనంగా  నిర్వహించారు. 

కౌడిపల్లి మండల కేంద్రంలో మినీ ట్యాంక్ బండ్ వద్ద సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ సుహాసినిరెడ్డి పాల్గొని కట్ట మైసమ్మ, గంగమ్మ తల్లికి పూజలు చేశారు. మెదక్  జిల్లా తూప్రాన్ పట్టణంలో మున్సిపల్ కమిషనర్ గణేశ్ రెడ్డి ఆధ్వర్యంలో చెరువు కట్ట వద్ద బతుకమ్మ ఆడారు. కోహెడ మండలంలోని శనిగరం గ్రామం, అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని కిష్టారెడ్డిపేట రెయిన్​బో మెడోస్ కాలనీలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు.