పాల్వంచ మండలం లో దేవీ శరన్నవరాత్రులను సక్సెస్ చేయండి : ఈవో రజనీకుమారి

పాల్వంచ మండలం లో దేవీ శరన్నవరాత్రులను సక్సెస్ చేయండి : ఈవో రజనీకుమారి

పాల్వంచ, వెలుగు : మండలం లోని కేశవాపురం జగన్నాథపురంలో ఉన్న కనకదుర్గ దేవస్థానం పెద్దమ్మ తల్లి ఆలయంలో సోమవారం నుంచి నిర్వహించే దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను సక్సెస్​ చేయాలని ఆలయ ఈవో రజనీకుమారి, ధర్మకర్తల మండలి చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, సభ్యులు కోరారు. ఆదివారం దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలే కరుల సమా వేశంలో వారు మాట్లాడారు.  ఇప్పటికే ఆలయంతో పాటు ప్రాంగ ణంలోని ఉపఆలయాలకు రంగులు వేసి, విద్యుత్ దీపాలంకరణ చేశామని, ప్రచార రథం ద్వా రా గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించామని తెలిపారు. సోమవారం కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు దంపతుల ద్వారా కలశ స్థాపన పూజలు నిర్వహించనున్న ట్లు చెప్పారు.

 అవధానుల శివ సంతోష్ కుమార్ శర్మ నేతృత్వంలో రుత్వికులు ఈ ఉత్సవాలను 11 రోజులు పాటు అత్యంత వైభవోపేతం గా నిర్వహించనున్న ట్లు తెలిపారు. అక్టోబర్  3 వరకు నిర్వహించే ఈ ఉత్సవాల సందర్భంగా రోజూ ఆలయ ప్రాంగణంలో కళాకారుల ద్వారా సాంస్కృతి క కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. గట్టి బందోబస్తు, మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ధర్మ కర్తల మండలి సభ్యులు చీకటి కార్తీక్, చెరుకూరి శేఖర్ బాబు, చెవుగాని పాపారావు, ధర్మరాజుల నాగేశ్వరరావు, డి .సుధాకర్, గిరిప్రసాద్, రామిరెడ్డి, రమ్య, సాయిబాబా  పాల్గొన్నారు.