రేపు (మే 11న) బంజారాహిల్స్ గోల్డెన్​ టెంపుల్​లో నరసింహస్వామి జయంతి

రేపు (మే 11న) బంజారాహిల్స్ గోల్డెన్​ టెంపుల్​లో నరసింహస్వామి జయంతి

హైదరాబాద్​ సిటీ, వెలుగు: బంజారాహిల్స్ గోల్డెన్ టెంపుల్ లో ఆదివారం శ్రీలక్ష్మీనరసింహస్వామి జయంతి నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హరేకృష్ణ మూమెంట్​రాష్ట్ర అధ్యక్షుడు  సత్యగౌర చంద్రదాస ప్రభూజీ తెలిపారు. తెలంగాణలో మొట్టమొదటి గోల్డెన్​టెంపుల్​ఇదేనని, నరసింహస్వామి జయంతిని వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.

భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రతి భక్తునికి జూలన్​సేవలో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. 11న మహాభిషేకం, జూలన్​ సేవ, హరినామ సంకీర్తన, స్వామి వారి కల్యాణం, 108 కలశాలతో అభిషేకం, మహా మంగళ హారతి కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు.