
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి చిత్తూరు జిల్లా రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది. జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న ఆయన.. ఆ తర్వాత గాదంకి జాతీయ వాతావరణ పరిశోధన సంస్థను సందర్శించారు. సాయంత్రం టీటీడీ వారి పద్మావతి అతిధి గృహంలో బస చేసి, రేపు ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోనున్నారు వెంకయ్య నాయుడు. తిరిగి బుధవారం తిరుపతి నుంచి హైదరాబాద్ కు వెళ్లనున్నారు.